అదేపనిగా వేడి నీరు తాగుతున్నారా..? అయితే ఈ నష్టాలు తప్పవు..!

ఈ మధ్యకాలంలో ఓ సమస్య ప్రజలలో చాలా సాధారణంగా అయిపోయింది. బరువు తగ్గడం ఎలా అనే విషయంలో చాలామంది ప్రజలు ఉదయం నిద్ర లేవగానే పళ్ళు తోముకున్న తర్వాత వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని ఖాళీ కడుపుతో తాగుతున్నారు.

 Are You Drinking Hot Watere But These Losses Are Inevitable-TeluguStop.com

కాబట్టి కేవలం ఒక గ్లాస్ వేడి నీటిని తాగితే వారి పొట్ట శుభ్రంగా ఉంటుంది.కొలెస్ట్రాల్ తగ్గడానికి కొంతమంది ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగుతూ ఉంటారు.

వేడి నీరు తాగడం శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.నీరు త్రాగడం వలన హైడ్రేట్ గా ఉంచుతుందని తరచుగా చెబుతూ ఉంటారు.

వేడి నీరు తాగడం వలన త్వరగా జీర్ణం అవుతుంది.ఫలితంగా ఇది సాధారణంగా ప్రేగు కదలికలకు సహాయం చేయడం వలన మలబద్ధకం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

వేడి నీరు శరీరం నిర్వేషీకరణకు కూడా సహాయపడుతుంది.ఇక చాలా పరిశోధనలు తగినంత మొత్తంలో నిరుత్రాగడం వలన బరువు తగ్గడంలో సహాయపడుతుందని కూడా తేలింది.ఎందుకంటే ఇది కడుపునిండా అనుభూతిని పెంచుతుంది.అలాగే 2003లో జరిపిన ఒక అధ్యయనంలో చల్లటి నీళ్లకు బదులుగా వేడి నీళ్లు తాగడం వలన బరువు తగ్గవచ్చు అని తేలింది.

ఇక మూసుకుపోయిన ముక్కుతో బాధపడుతున్నట్లయితే గోరువెచ్చని నీటిని తాగడం వలన కూడా చాలా ఉపశమనం లభిస్తుంది.ఇక ఉదయాన్నే గోరువేచ్చని నీటిని తాగడం వలన శరీరంపై ఓదార్పు ప్రభావం కూడా చూపుతుంది.

Telugu Hotwatere, Tips-Telugu Health

దీంతో కండరాల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.కానీ అదే పనిగా వేడి నీళ్లు తాగడం వలన ద్రుష్పవాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి.దేన్నైనా కూడా మితిమీరి తీసుకోకూడదు అంటారు.అందుకే వేడినీటినీ ఎక్కువగా తాగడం వలన శరీరంలోని నీటి సాంద్రతలో అసమతుల్యత ఏర్పడుతుంది.మీరు చాలా వేడి నీటిని తాగితే మాత్రం అది మీ నిద్ర చక్రాన్ని అంతరాయం కలిగిస్తుంది.ఇక వేడి నీటిని ఎక్కువగా తీసుకోవడం వలన మూత్రపిండాలపై కూడా దుష్ప్రభావాలు ఉంటాయి.

ఇక పదే పదే వేడి నీటిని తీసుకోవడం వలన అంతర్గత చికాకు కూడా కలుగుతుంది.ఇక వేడి నీటి కంటే గోరువెచ్చని నీటిని తీసుకోవడం మంచిది.

అందుకే మితిమీరి వేడి నీరు తీసుకోకుండా జాగ్రత్త పడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube