న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలుగు రాష్ట్రాల్లో వడగళ్ల వానకు అవకాశం

Telugu Ap Cm Jagan, Ap, Asaduddin Oyc, Chandrababu, Jagan, Jagadish Reddy, Renuk

ఏపీ , తెలంగాణలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.నిన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కేసులో ఆమెను అరెస్ట్ చేశారు.

3.రాయల తెలంగాణపై మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్

Telugu Ap Cm Jagan, Ap, Asaduddin Oyc, Chandrababu, Jagan, Jagadish Reddy, Renuk

రాయల తెలంగాణ అంశంపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు.ప్రత్యేక రాయలసీమ,  రాయల తెలంగాణ ఇప్పట్లో సాధ్యం కాదని  మంత్రి అన్నారు.

4.కేరళలో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం

కేరళలో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోది ఈరోజు ప్రారంభించారు.ఈ రైలు తిరువనంతపురం నుంచి కేసర్ ఘడ్ వరకు ప్రయాణించనుంది.

5.భారత్ లో కరోనా

Telugu Ap Cm Jagan, Ap, Asaduddin Oyc, Chandrababu, Jagan, Jagadish Reddy, Renuk

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 6,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

6.పులివెందులకు అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాదు నుంచి పులివెందులకు బయలుదేరారు.

7.యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపులు

Telugu Ap Cm Jagan, Ap, Asaduddin Oyc, Chandrababu, Jagan, Jagadish Reddy, Renuk

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపుతామంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి టోల్ ఫ్రీ నెంబర్ 112 కి కాల్ చేసి  బెదిరింపులకు పాల్పడ్డాడు.

8.ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు

టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను విజయవాడలో ఈ నెల 28న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

9.ఆర్టిజన్స్ నిరవధిక సమ్మె

Telugu Ap Cm Jagan, Ap, Asaduddin Oyc, Chandrababu, Jagan, Jagadish Reddy, Renuk

 వేతన సవరణతో దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్లు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి నిరవధిక దీక్షకు దిగారు.

10.షర్మిల అరెస్ట్ కు నిరసనగా

Telugu Ap Cm Jagan, Ap, Asaduddin Oyc, Chandrababu, Jagan, Jagadish Reddy, Renuk

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అరెస్టుకు నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు ఆ పార్టీ పిలుపునిచ్చింది.

11.నేడు బీఆర్ఎస్ ప్రతినిధుల సభలు

నేడు తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభలను నిర్వహిస్తున్నారు.

12.నేడు వరంగల్ లో…

నేడు వరంగల్ శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణోత్సవం రాత్రి 7 గంటలకు దేవాలయం ఆరు బయట వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

13.భట్టి విక్రమార్క పాదయాత్ర

Telugu Ap Cm Jagan, Ap, Asaduddin Oyc, Chandrababu, Jagan, Jagadish Reddy, Renuk

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర హనుమకొండ జిల్లాలో మూడో రోజు కొనసాగుతోంది.

14.ఉద్యోగుల మహాధర్నా

 కర్నూల్లో నేడు ప్రభుత్వ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నా కర్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

15.నేడు శ్రీశైలంలో

Telugu Ap Cm Jagan, Ap, Asaduddin Oyc, Chandrababu, Jagan, Jagadish Reddy, Renuk

నేడు శ్రీశైలంలో వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా ఆదిశంకరుల జయంతోత్సవం ఏర్పాటు చేశారు.

16.ఎన్టీఆర్ అసెంబ్లీ ప్రసంగాల పుస్తకం విడుదల

 అమరావతిలో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ చారిత్రక, అసెంబ్లీ ప్రసంగాలు పుస్తక విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

17.ఫ్యాప్టో ఆధ్వర్యంలో నేడు ఆందోళనలు

విజయవాడలో ఉపాధ్యాయుల సస్పెన్షన్లను నిరసిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో నేడు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.నేడు రేపు నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయులు నిరసన తెలుపనున్నారు.

18.కేటీఆర్ కామెంట్స్

Telugu Ap Cm Jagan, Ap, Asaduddin Oyc, Chandrababu, Jagan, Jagadish Reddy, Renuk

కాంగ్రెస్,  బిజెపిని తప్పకుండా ప్రజలు బండకేసి కొడతారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

19.మంత్రి పువ్వాడ అజయ్ కు రేణుక చౌదరి సవాల్

Telugu Ap Cm Jagan, Ap, Asaduddin Oyc, Chandrababu, Jagan, Jagadish Reddy, Renuk

ఖమ్మంలో నాపై పోటీ చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి పొవ్వాడ అజయ్ కు కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ నాయకురాలు రేణుక చౌదరి సవాల్ విసిరారు.

20.ఖబడ్దార్ అమిత్ షా

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే కేసీఆర్ ప్రభుత్వం కల్పిస్తున్న ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించడంపై ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఖబడ్దార్ అమిత్ షా అంటూ హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube