బయోటిన్ అంటే ఏమిటి.. మన శరీరానికి ఎందుకు అవసరం..?

బయోటిన్( Biotin ).మన శరీరానికి అవసరమయ్యే అతి ముఖ్యమైన పోషకాల్లో ఇది ఒకటి.

 What Is Biotin Role In Our Body? Biotin, Biotin Role, Biotin Functions, Latest N-TeluguStop.com

అయితే బయోటిన్ పేరు వినడమే తప్ప మనలో చాలా మందికి దీని గురించి సరైన అవగాహన లేదు.అసలు బయోటిన్ అంటే ఏమిటో కూడా కొందరికి తెలియదు.

ఈ నేపథ్యంలోనే బయోటిన్ అంటే ఏమిటి.? అది మన శరీరానికి ఎందుకు అవసరం.? వంటి విషయాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బయోటిన్ అనేది నీటిలో కరిగే విటమిన్.

దీనిని విటమిన్ బి7 ( Vitamin B7 )లేదా కొన్నిసార్లు విటమిన్ హెచ్ అని కూడా పిలుస్తారు.జుట్టు, చర్మం, గోళ్లు ఆరోగ్యానికి బయోటిన్ చాలా అవసరం.

కెరాటిన్‌ను తయారు చేయడంలో బయోటిన్ ముఖ్య పాత్ర‌ను పోషిస్తుంది.కెరాటిన్ అనేది స్ట్రక్చరల్ ప్రోటీన్.

ఇది కొత్త జుట్టు పెరుగుద‌ల‌ను ప్రోత్స‌హిస్తుంది.హెయిర్ ఫోలికల్స్‌ను ఉత్తేజప‌రుస్తుంది.

హెయిర్ ఫాల్ ను అరిక‌డుతుంది.అలాగే మంచి బయోటిన్ స్థాయిలు ఉన్నవారిలో గోళ్లు బ‌లంగా ఉంటాయి.

చ‌ర్మం అందంగా మెరుస్తుంటుంది.

Telugu Biotin Benefits, Biotin, Biotin Role, Tips, Latest, Vitamin-Telugu Health

కార్బోహైడ్రేట్లు, కొవ్వులు( Carbohydrates, fats ) మరియు ప్రోటీన్లను శక్తిగా మార్చడంలో బయోటిన్ స‌హాయ‌ప‌డుతుంది.అలాగే గుండె పనితీరు సక్రమంగా సాగాలన్నా, నాడుల పనితీరు మెరుగ్గా ఉండాలన్నా, జీర్ణ క్రియ చురుగ్గా పని చేయాలన్నా, మెటబాలిజం సమర్థంగా ఉండాలన్నా బయోటిన్ ను కచ్చితంగా తీసుకోవాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు.అంతేకాదు ప్రెగ్నెన్సీ సమయంలో బయోటిన్ కడుపులోని పిండం అభివృద్ధికి మద్దతు ఇస్తుంది.

మధుమేహం( diabetes ) నిర్వహణలో సంభావ్యంగా సహాయకరంగా కూడా ఉంటుంది.

Telugu Biotin Benefits, Biotin, Biotin Role, Tips, Latest, Vitamin-Telugu Health

ఇక శ‌రీరంలో బ‌యోటిన్ లోపం ఏర్ప‌డిన‌ప్పుడు జుట్టు అధికంగా ఊడిపోతుంటుంది.అలాగే స్కిన్ డ్రై అవ్వ‌డం, నిర్జీవంగా మార‌డం జ‌రుగుతుంది.ఎప్పుడూ నీరసంగా కూడా ఉంటారు.

ఇటువంటి ల‌క్ష‌ణాలు మీలో క‌నుక ఉంటే బ‌యోటిన్ రిచ్ ఫుడ్స్ ను వెంట‌నే డైట్ లో చేర్చుకోండి.బాదం, వేరుశెనగ, వాల్ న‌ట్స్‌, గుడ్డు, సోయా బీన్స్, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, కాలీఫ్లవర్, అరటిపండ్లు, పుట్టగొడుగులు వంటి ఆహారాల్లో బియోటిన్ పుష్క‌లంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube