ఇమ్మ్యూనిటి కోసం వర్షాకాలంలో ఖచ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే...!

వర్షాకాలంలో నేరేడు పండ్లు అధికంగా లభిస్తాయి.వాస్తవానికి నేరేడు పండులో క్యాలరీలలో చాలా తక్కువగా ఉంటాయి.

 Immunity Boosting  Fruits, Rainy Season, Human Body, Immunity Power, Human Body-TeluguStop.com

ఇక నేరేడు పండులో ఐరన్, ఫైబర్, పొటాషియం విటమిన్లు అధికంగా లభిస్తాయి.ప్రస్తుత రోజుల్లో అధిక బరువు సమస్యతో బాధపడేవారు నేరేడు పండ్లు తీసుకుంటే సులువుగా వారి బరువును తగ్గించు పోవచ్చు.

అంతేకాకుండా అజీర్ణ సమస్యతో బాధపడే వారు కూడా ఇవి తీసుకుంటే వారి సమస్య నుంచి బయటపడవచ్చు.

నిజానికి వర్షాకాలంలో జీవక్రియల రేటు కాస్త నిదానంగా ఉండడంతో శరీరం కూడా చురుకుగా ఉండదు.

కాబట్టి, ఆపిల్ తీసుకుంటే ఆరోగ్యకరంగా చురుగ్గా ఉండవచ్చు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోగనిరోధకశక్తి పెంచుకోవాలంటే దానిమ్మ తీసుకోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

అలాగే వర్షాకాల సమయంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా రోజుకు ఒక దానిమ్మ పండు తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆరోగ్యకరంగా ఉండవచ్చు.అలాగే రోగనిరోధక శక్తిని పెంచే మరొక పండు బొప్పాయి.

ఇందులో విటమిన్ సి అధికంగా లభిస్తుంది.దీనితో రోగనిరోధకశక్తిని సులువుగా పెంచుకోవచ్చు.

అంతేకాకుండా బొప్పాయి తినడం వల్ల వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు.ఇక బొప్పాయి పండులో పీచు ఎక్కువగా లభిస్తుంది.

కనుక బొప్పాయిని తక్కువ శాతంలో సేవిస్తే మంచిదని పోషక ఆహార నిపుణులు తెలియజేస్తున్నారు.

Telugu Immunity Fruits, Immunity, Rainy Season-Telugu Health

ఇక జీర్ణక్రియ వ్యవస్థ ను శుభ్రం చేసుకోవడం కోసం అరటి పండ్లను తీసుకుంటే చాలా మంచిదని వారు తెలియజేస్తున్నారు.అరటి పండులో విటమిన్లు, మినరల్స్ అధికంగా లభిస్తాయి.ఇక పసి పిల్లలకు రోజూ ఒక అరటిపండు తినిపిస్తే వారి శరీరానికి శక్తి అందడంతో పాటు వారికి పుష్కలంగా ఆహారం లభిస్తుంది అనే భావన కలిగిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube