1984లో పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో ( Golden Temple in Punjab )దాక్కొన్న ఖలిస్తాన్ వేర్పాటువాది జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలే సహా సిక్కు మిలిటెంట్లను ఏరిపారేయడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు భారత సైన్యం ఆపరేషన్ బ్లూ స్టార్ ( Operation Blue Star )నిర్వహించిన సంగతిత తెలిసిందే.ఈ ఘటన భారత చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది.
ఆపరేషన్ తర్వాత ప్రధాని ఇందిరా గాంధీ హత్య , 1984 సిక్కుల ఊచకోత, పంజాబ్‌లో ఉద్రిక్త పరిస్ధితులు వంటి పరిణామాలు చోటు చేసుకుని నేటికీ ఈ రావణ కాష్టం రగులుతూనే ఉంది.
తాజాగా ఆపరేషన్ బ్లూ స్టార్‌పై భారత సంతతికి చెందిన బ్రిటీష్ సిక్కు ఎంపీ తన్మన్ జీత్ సింగ్ ధేసీ ( MP Tanman Jeet Singh Dhesi )వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్‌లో అప్పటి బ్రిటీష్ ప్రధాని మార్గరెట్ థాచర్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ ప్రభుత్వం ప్రమేయం ఎంత ఉందో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.ఇందుకోసం ఓ స్వతంత్ర విచారణ జరిపించాలని తన్మన్ కోరారు.
మనుపటి కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వాలు ఈ విషయాన్ని మరుగున పెట్టడానికి ప్రయత్నించారని తన్మన్ జీత్ సింగ్ ఆరోపించారు.ప్రస్తుతం ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని స్లౌ( Slough in southeast England ) నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది విధ్వంసానికి, రక్తపాతానికి దారి తీసిందని .దీని వల్ల వేలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ధేసి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దారుణ ఘటనకు అప్పటి మార్గరెట్ థాచర్ ప్రభుత్వం ( Thatcher’s government )సలహా ఇవ్వడంతో పాటు అవసరమైన సాయం చేసిందని కొన్ని పత్రాలు వెల్లడించడం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని తన్మన్ జీత్ తెలిపారు.దీని వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టేందుకు స్వతంత్ర విచారణ అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.
ధేసి గతంలోనూ పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు.ఆయన వ్యాఖ్యల తర్వాత హౌస్ ఆఫ్ కామన్స్ నాయకురాలు లూసీ పావెల్ మాట్లాడుతూ.
యూకేలోని సిక్కు సమాజానికి ఇది చాలా ముఖ్యమైన విషయమని పేర్కొన్నారు.