బాన పొట్ట లేదా బెల్లీ ఫ్యాట్( Belly fat ) తో బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు.గంటలు తరబడి కూర్చుని ఉండడం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శరీరానికి శ్రమ లేకపోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోతుంది.
దాంతో నాజూగ్గా ఉండాల్సిన పొట్ట బాన మాదిరి తయారవుతుంది.అయితే కొందరు బాన పొట్టను తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నిస్తుంటారు.
అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.నిత్యం ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే నెల రోజుల్లో బాన పొట్ట మాయం అవుతుంది.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ), రెండు టేబుల్ స్పూన్లు వాము, రెండు టేబుల్ స్పూన్లు సోంపు( anise ), రెండు అంగుళాలు దాల్చిన చెక్క ( Cinnamon )వేసుకోవాలి.వీటితో పాటు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.రోజు ఉదయం ఒక గ్లాస్ వాటర్ లో హాఫ్ టీ స్పూన్ తయారు చేసుకున్న పొడిని వేసి ఐదారు నిమిషాల పాటు మరిగించి వడకట్టి తాగేయాలి.

మార్నింగ్ టీ, కాఫీలకు బదులుగా ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే పొట్ట చుట్టూ భారీగా పేరుకుపోయిన కొవ్వు మొత్తం క్రమంగా కరగడం స్టార్ట్ అవుతుంది.బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.పొట్ట కొవ్వును కరిగించేందుకు ఈ డ్రింక్ సూపర్ ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.అంతేకాకుండా నిత్యం ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.జలుబు, దగ్గు వంటి సమస్యలు పరార్ అవుతాయి.అలాగే ఈ డ్రింక్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
మధుమేహం వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఈ డ్రింక్ తోడ్పడుతుంది.