అరవిందస్వామి.నిన్నటి తరం యువతకు కలల హీరో కూడా చెప్పుకోవచ్చు.ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టాడు.చాలామంది నటీనటులు డాక్టర్ కావాలని అనుకున్నామని కానీ యాక్టర్ అయ్యామని చెబుతుంటారు.ఆ కోవకు చెందినవాడే అరవింద్ స్వామి.నిజానికి అరవిందస్వామి కి కూడా చదువు అంటే ఎంతో మక్కువ.డాక్టర్ కావాలని ఎంతో కష్టపడ్డాడు.అంతేకాదు డబ్బులు సరిపోక పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చేసేవాడు.అయినా కూడా డబ్బులు సరిపోక ప్రకటనల్లో కూడా నటించాడు.
ఆ ప్రకటన చూసిన మణిరత్నం ఈ కుర్రాడు ఎవరో బానే ఉన్నాడు అని అరవింద్ స్వామి ని ఆఫీస్ కు రమ్మని కబురు చేశాడట.
అలా మొదటిసారి దళపతి సినిమా కోసం మణిరత్నం అరవింద్ స్వామిని తీసుకున్నాడు.ఆ తర్వాత అరవింద్ స్వామి బొంబాయి, రోజా సినిమా ద్వారా యావత్ దేశాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు.
కానీ సినిమాల్లో నటిస్తున్న క్రమంలో బిజినెస్ వైపు అడుగులు వేసి కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరం అయ్యాడు.చాల రోజుల తర్వాత తన్ని ఒరువన్ అనే తమిళ్ సినిమాతో రిఎంట్రీ ఇచ్చాడు.
అదే సినిమా ధ్రువ పేరుతో విడుదలై బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది.ఇక ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు.
ఎప్పటికైనా దర్శకత్వం వహించాలని అరవింద్ స్వామి కోరిక.
అరవింద్ స్వామి వ్యక్తిగత జీవితానికి వస్తే అతడికి మొదటగా వివాహం జరిగి విడాకులు కూడా అయ్యాయి.వీరికి ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు.ఆ తర్వాత ఒక న్యాయవాది ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు అరవిందస్వామి కూతురు అదిర.
ఈ అమ్మాయి లండన్లో చదువుకుంది తండ్రికి తగ్గ తనయగా పేరు సంపాదించుకుంటుంది.డిగ్రీ లో గోల్డ్ మెడల్ కూడా సంపాదించింది.
తండ్రి సాధించలేనిది నేడు కూతురు సాధించాలని అనుకుంటుంది అందుకే తండ్రి వ్యాపారాలను సైతం కూతురు అదిరా కొనసాగిస్తుంది.అరవింద్ స్వామి సినిమాలు మానేసిన తర్వాత ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టాడు.
ప్రస్తుతం సినిమాలతో అరవింద్ స్వామి బిజీగా ఉండటం వల్ల ఆ కంపెనీ బాధ్యతలను కూతురు చూసుకుంటుంది.ఏది ఏమైనా అరవింద్ స్వామి ని మించి పోయేలా ఉంది ఈ అమ్మాయి
.