జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న టీమ్ లలో సుడిగాలి సుధీర్ టీమ్ ఒకటనే సంగతి తెలిసిందే.సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను సంవత్సరాల తరబడి జబర్దస్త్ షోలో స్కిట్లు చేస్తున్నారు.
అయితే ఇన్ని సంవత్సరాలుగా వీళ్లు కలిసి ఉండటం చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్ లకు స్వతహాగా వేర్వేరు టాలెంట్స్ ఉండగా వీళ్ల ఐకమత్యాన్ని చూసి ఆశ్చర్యపోయే వాళ్లు చాలామంది ఉన్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో గెటప్ శ్రీను మాట్లాడుతూ మా టీమ్ లో కూడా గొడవలు జరుగుతాయంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.తమ ముగ్గురి మధ్య ఎవరూ గొడవలు పెట్టకూడదనే ఉద్దేశంతో తామే గొడవ పడతామని గెటప్ శ్రీను అన్నారు.
ప్రేక్షకుల్లో చాలామంది ముగ్గురూ కలిసి స్కిట్లు చేస్తుండటంతో తమ స్పూర్తిని, ఐకమత్యాన్ని మెచ్చుకుంటారని వాళ్లు చెప్పే మాటలు తమలో బాధ్యతతో పాటు భయాన్ని కూడా పెంచుతాయని గెటప్ శ్రీను ఆన్నారు.

తమ ముగ్గురూ కలిసి ఉండటాన్ని చూసి ప్రేక్షకులలో చాలామంది ఆనందిస్తారని అన్నారు.భవిష్యత్తులో కూడా సుడిగాలి సుధీర్ టీమ్ విడిపోయే అవకాశాలు లేవని తెలుస్తోంది.సన్నీ కూడా తమతో కలిసి ఉన్నాడని ఏ పాత్ర ఇచ్చినా సన్నీ ఏమీ అనడని కొన్నిసార్లు సన్నీ డైలాగులే లేని పాత్రలు కూడా చేశాడని గెటప్ శ్రీను చెప్పారు.
సుధీర్ ఈ షోతో పాటు ఇతర షోలతో కూడా బిజీ అవుతున్నారు.