టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన రష్మిక( Rashmika ) ఈ మధ్య కాలంలో ఎక్కువగా వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.స్టార్ హీరోయిన్ రష్మిక తన ప్రతిభతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
రష్మిక చేసిన కొన్ని కామెంట్ల వల్ల కన్నడ నాట ఆమెపై ఊహించని స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుండటం గమనార్హం.ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే( Congress MLA ) రష్మికపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే.
అయితే నటి రమ్య( Actress Ramya ) మాత్రం రష్మికను టార్చర్ చేయొద్దంటూ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.నటిగా, రాజకీయ నాయకురాలిగా రష్మిక ప్రేక్షకులకు సుపరిచితం కాగా తాజాగా బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో( Bengaluru International Film Festival ) ఆమె మాట్లాడారు.
రష్మిక లాంటి హీరోయిన్లను ట్రోల్స్ ద్వారా అవమానించడం దయచేసి ఆపాలని రమ్య కోరారు.

ఇది అమానవీయమని ఆమె పేర్కొన్నారు.ఆడపిల్లలు మెత్తగా ఉంటారని ఏమన్నా అంటే తిరిగి మాట్లాడలేరు కాబట్టి వాళ్లను హింసించడం తగదని ఆమె వెల్లడించారు.ప్రస్తుతం సినిమా రంగం మాత్రమే కాదని ఇతర రంగాలలో సైతం మహిళలకు అన్యాయం జరుగుతోందని రమ్య పేర్కొన్నారు.
దీనికి వ్యతిరేకంగా మనమంతా ఐక్యంకావాలని రమ్య పిలుపునిచ్చారు.

రష్మికకు అనుకూలంగా రమ్య మాట్లాడటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.రష్మిక వరుసగా 1000 కోట్ల రూపాయల సినిమాలతో భారీ విజయాలను ఖాతాలో వేసుకుంటున్న సంగతి తెలిసిందే.రష్మిక కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగి రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.
రష్మిక పారితోషికం సైతం ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.రష్మిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.







