బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు ప్రభాస్( Prabhas ).ఈ సినిమా తర్వాత ఈయన కెరియర్ పరంగా ఎంతో బిజీగా మారిపోయారు.
ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమా షూటింగ్ పనులలో ప్రభాస్ బిజీగా గడుపుతున్నారు.ఇలా ఒకవైపు తన సినిమా షూటింగ్స్ జరుపుకుంటూనే మరోవైపు ఇతర హీరోల సినిమాలలో కూడా ప్రభాస్ గెస్ట్ రోల్( Prabhas Guest Role ) చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇప్పటికే ఈయన మంచు విష్ణు ( Manchu Vishnu ) డ్రీం ప్రాజెక్ట్ ఆయన కన్నప్ప( Kannappa ) సినిమాలో కూడా భాగమయ్యారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఏప్రిల్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఈ సినిమాలో ఇతర భాష సెలబ్రిటీలు భాగమయ్యారు.ఇక ప్రభాస్ కూడా రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.మంచు మోహన్ బాబుతో ప్రభాస్ కు ఉన్న అనుబంధం కారణంగానే ఈ సినిమాలో నటించారని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ మరో హీరో సినిమాలో కూడా గెస్ట్ పాత్రలో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ వార్తలు వస్తున్నాయి మరి ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆ సినిమా మరేదో కాదు రాజమౌళి ( Rajamouli ) మహేష్ బాబు ( Mahesh Babu ) కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో ప్రభాస్ ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.రాజమౌళి ప్రభాస్ మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు.బాహుబలి తర్వాత రాజమౌళి చేసిన RRR సినిమాలో నాకేదైనా ఒక గెస్ట్ రోల్ ఇవ్వచ్చు కదా డార్లింగ్ అంటూ బహిరంగంగా ప్రభాస్ రాజమౌళిని అడిగారు.
అందుకే మహేష్ బాబు సినిమాలో ప్రభాస్ కోసం ఒక స్పెషల్ పాత్ర డిజైన్ చేశారని తెలుస్తోంది.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే థియేటర్లో బద్దలై పోవాల్సిందేనని మహేష్ ప్రభాస్ ఫ్యాన్స్ సంబరం వ్యక్తం చేస్తున్నారు.







