టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ప్రస్తుతం క్రేజ్ పరంగా, కెరీర్ పరంగా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.బాలయ్య నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి సక్సెస్ సాధిస్తున్నాయి.
బాలయ్య సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం ఒకింత కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.స్టార్ హీరో బాలకృష్ణ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారనే సంగతి తెలిసిందే.
బాలయ్యకు మంత్రి పదవి దక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.నాగబాబుకు( Nagababu ) మంత్రి పదవి దక్కుతున్న నేపథ్యంలో ఈ కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.అయితే బాలయ్యకు మంత్రి పదవి( Balakrishna Minister Seat ) విషయంలో చంద్రబాబు( Chandrababu ) వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.బాలయ్య కోరితే ఆయనకు మంత్రి పదవి దక్కడం మరీ కష్టం అయితే కాదని కచ్చితంగా చెప్పవచ్చు.

అయితే బాలయ్యకు మంత్రి పదవిపై మాత్రం పెద్దగా ఆశలు లేవని గతంలో పలు సందర్భాల్లో వెల్లడైంది.అభిమానులు మాత్రం బాలయ్యను మంత్రిగా చూడాలని బలంగా కోరుకుంటున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.బాలయ్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా అఖండ2( Akhanda 2 ) ప్రస్తుతం సెట్స్ పై ఉంది.

ఈ ఏడాదే అఖండ సీక్వెల్ థియేటర్లలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది.అఖండ2 సినిమా బడ్జెట్ ఏకంగా 200 కోట్ల రూపాయలు కాగా బాలయ్య మార్కెట్ ను మించి నిర్మాతలు ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండనున్నాయో చూడాల్సి ఉంది.బాలయ్య పారితోషికం ప్రస్తుతం 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాలయ్య కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.