టొరంటోకు( Toronto ) చెందిన ఒక వ్యక్తి విచిత్రమైన పరుగుతో సరికొత్త సంచలనం సృష్టించాడు.ఫిట్‌నెస్, టెక్నాలజీ, కళలను కలిపి అద్భుతం చేశాడు.
ఏకంగా ఏడాదిపాటు 1,105 కిలోమీటర్లు (687 మైళ్లు) పరుగెత్తి మ్యాప్‌లో డ్యాన్స్ చేస్తున్న బొమ్మను గీశాడు.GPS ట్రాకింగ్ యాప్‌ను( GPS tracking app ) ఉపయోగించి తన రూట్లను ప్లాన్ చేసుకున్నాడు.
ఈ అద్భుతమైన పని సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ హ్యూమన్ రేస్ అనే X (ట్విట్టర్) ఖాతా అతని విజయాన్ని షేర్ చేసింది.“డ్యాన్స్ చేస్తున్న బొమ్మను రూపొందించడానికి ఒక టొరంటో వ్యక్తి ఏడాదికి పైగా 1,105 కిలోమీటర్లు పరుగెత్తాడు” అని క్యాప్షన్ పెట్టింది.అతని కదలికలతో రూపొందించిన యానిమేటెడ్ బొమ్మను చూపిస్తూ ఒక GIF కూడా పోస్ట్ చేసింది.
ఈ పోస్ట్‌కు 12.7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.చూసినవాళ్లంతా షాక్.చాలా మంది అతని డెడికేషన్ మరియు క్రియేటివిటీకి ఫిదా అయిపోయారు.ఒక యూజర్ సరదాగా కామెంట్ చేస్తూ, “ఈ మనిషి ఏడాది మొత్తం ఆర్ట్ కోసం పరిగెత్తాడు, కానీ నేను ఫ్రిజ్ వరకు నడవడానికి కూడా కష్టపడుతున్నాను.హాట్సాఫ్” అని అన్నాడు.మరొకరు “దీని వెనుక ఉన్న ఎఫర్ట్, ప్లానింగ్ నమ్మశక్యం కాదు” అని రాశారు.మూడో వ్యక్తి “ఫన్ ట్విస్ట్‌తో కూడిన సీరియస్ కమిట్‌మెంట్” అని కామెంట్ చేశాడు.
అయితే, కొందరు మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు.ఇది ఫేక్ అని, డిజిటల్‌గా ఎడిట్ చేసి ఉంటారని అంటున్నారు.ఒకరు “ఇది టిక్‌టాక్ వీడియో అని చూడగానే ఇది ఫేక్ అని నాకు అర్థమైంది.కానీ ఎడిటింగ్ మాత్రం సూపర్.” అని రాశాడు.మరొకరు “0:21 వద్ద అతను టోపీ తిప్పినప్పుడు అది బొమ్మకు సరిపోలేదు.అప్పుడే ఇది నిజం కాదని నాకు తెలిసింది” అని అన్నారు.నిజమో కాదో తెలియదు కానీ, ఈ పోస్ట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.దీన్ని మీరు కూడా చూసేయండి.