దేవుడా, ఒక్క కాలు జీన్స్ ప్యాంటుకి రూ.38 వేలా? ఇదేం పిచ్చి ఫ్యాషన్ రా బాబోయ్..

సోషల్ మీడియా ఇప్పుడు కొత్త ట్రెండ్‌తో షాక్ అవుతోంది.అదేంటంటే, ఒక్క కాలు జీన్స్ ప్యాంటు( Jeans ).

 Oh My God, Rs. 38,000 For A Single Pair Of Jeans This Is Crazy Fashion, Bro, One-TeluguStop.com

అవును వన్ లెగ్ మాత్రమే ఉండే జీన్స్ ప్యాంటు ఇప్పుడు హాట్ టాపిక్.ధర ఎంతంటే అక్షరాలా రూ.38,330 ఫ్యాషన్ లవర్స్‌ దీన్ని ట్రై చేయడానికి రెడీగా ఉన్నా, మిగతావాళ్లు మాత్రం “ఇదేం వెర్రి? ఇది ఎక్కడి వరకు పోతుంది?” అని ముక్కున వేలేసుకుంటున్నారు.</టిక్‌టాక్‌లో 16 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న క్రిస్టీ సారా అనే ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ కొత్త జీన్స్‌ను వేసుకొని చూసింది.

"ఇంటర్నెట్‌లో ఇదే మోస్ట్ కాంట్రవర్షియల్ జీన్స్" అని కామెంట్ చేసింది.కానీ ఆమె భర్త డెస్‌మండ్ మాత్రం మొహం మీదే "ఇదేం వెర్రి వేషాలు ఎవ్వరూ వేసుకోరు" అని తేల్చి చెప్పేశాడు.

సోషల్ మీడియా జనాలు అయితే రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.కొందరేమో “ఇది కొంచెం పొట్టిగా లేదా.ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు లేదు” అంటున్నారు.“ఇది దుప్పటి కప్పుకోకుండా ఒక కాలు బయట పెట్టి పడుకున్నట్టు ఉంది” అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.“మోకాళ్ల వరకు ఉండే బూట్లతో వేసుకుంటే బాగుంటుందేమో” అని సలహా ఇస్తున్నారు.”ఇలా వేసుకుంటే చాలా వింతగా అనిపిస్తుంది కదా” అని ఆశ్చర్యపోతున్నారు.ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్ కార్సన్ క్రెస్లీ( Fashion Expert Carson Kressley ) అయితే ఒక పంచ్ డైలాగ్ పేల్చాడు.“ఈ ట్రెండ్ ఎక్కువ రోజులు నిలబడకుండా కొన్ని రోజుల్లో ఆగిపోవాలని కోరుకుందాం” అని జోక్ చేశాడు.

ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ కోపెర్ని ఈ జీన్స్‌ను డిజైన్ చేసింది.వాళ్లు దీన్ని “సాంప్రదాయానికి పూర్తి విరుద్ధం” అంటున్నారు.ఇది హై-వయిస్టెడ్ షార్ట్స్, ఒక కాలు బూట్‌కట్ డిజైన్ మిక్స్ చేసి తయారుచేశారట.

గత సంవత్సరమే కోపెర్ని అసిమ్మెట్రికల్ ఫ్యాషన్‌ను పరిచయం చేసింది.మోడల్ అమేలియా గ్రే సగం ప్యాంటు సగం సూట్ వేసుకొని ర్యాంప్ వాక్ చేసింది గుర్తుంది.

ఎంతమంది తిట్టిపోసినా ఈ ఒక్క కాలు జీన్స్ మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.ఎక్స్‌ట్రా స్మాల్, స్మాల్, మీడియం సైజులు అయితే అసలు లేవు, మొత్తం సోల్డ్ అవుట్! కొనలేకపోయిన కొందరు ఫ్యాషన్ లవర్స్ పాత జీన్స్‌ ప్యాంటుకు ఒక కాలు కట్ చేసి మరి ఈ స్టైల్‌ను కాపీ కొడుతున్నారు.

ఇప్పుడు వింత వింత డెనిమ్ స్టైల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.కెండ్రిక్ లామార్ ఫ్లేర్డ్ జీన్స్‌ను మళ్లీ వెనక్కి తీసుకొచ్చిన తర్వాత ఇవి ఇంకా ఎక్కువయ్యాయి.బోట్టెగా వెనెటా, లూయిస్ విట్టన్ లాంటి పెద్ద ఫ్యాషన్ హౌస్‌లు కూడా బోల్డ్ డిజైన్స్‌తో ప్రయోగాలు చేస్తున్నాయి.

కార్సన్ క్రెస్లీ చెప్పిన ప్రకారం ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్స్‌ను డిజైనర్లు, సంస్కృతి కంటే సోషల్ మీడియానే ఎక్కువగా డిసైడ్ చేస్తోంది.ఒక్క కాలు జీన్స్ ట్రెండ్ ఎక్కువ కాలం ఉంటుందో లేదో తెలీదు కానీ, ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube