ఈ మధ్య కాలంలో పైల్స్ వ్యాధి ఎందరినో వేధిస్తోంది.ముఖ్యంగా మగవారిలో ఈ వ్యాధి బాధితులు మరీ ఎక్కువగా ఉంటున్నారు.
మలద్వారం లోపల మరియు చుట్టూ వాపు వచ్చి పెరిగే కణితులనే పైల్స్ అంటారు.ఈ పైల్స్‌ను నివారించుకునేందుకు ఎన్నెన్నో మందులు వాడతారు.
కొందరు ఆపరేషన్ కూడా చేయించుకుంటారు.అయితే కొన్ని కొన్ని ఫుడ్స్ ద్వారా సైతం ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
మరి లేట్ చేయకుండా ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి ఉల్లి పైల్స్‌ను నివారించడంలో ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.పచ్చి ఉల్లిని డైరెక్ట్‌గా తీసుకోవడం లేదా రసం రూపంలో తీసుకోవడం చేస్తే పైల్స్ మరియు పైల్స్ లక్షణాలు దూరం అవుతాయి.
కొన్ని పండ్లు పైల్స్ వ్యాధిని తగ్గించగలవు.
ముఖ్యంగా అరటి పండ్లు, దానిమ్మ పండ్లు, అంజీర పండ్లు, మామిడి పండ్లు, బొప్పాయి పండ్లు వంటివి డైట్‌లో ఉండేలా చూసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే పైల్స్‌ను సహజంగా నివారించడంలో పసుపు కూడా ఎఫెక్టివ్‌గా సహాయపడుతుంది.
అందుకే, పసుపును ప్రతి రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.
పైల్స్ వ్యాధితో సతమతమయ్యే వారు ప్రతి రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో ఒక స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ నిమ్మ రసం మరియు ఒక స్పూన్ తేనె కలుపుకుని సేవించాలి.
ఇలా చేస్తే త్వరగా పైల్స్ సమస్య తగ్గుతుంది.
ఇక పైల్స్ ఉన్న వారు వాటర్‌ను ఎక్కువగా తీసుకోవాలి.ఫాస్ట్ ఫుడ్స్, వేపుళ్లు, మాంసాహరం వంటి వాటికి దూరంగా ఉండాలి.మద్యపానం, ధూమపానం అలవాట్లను మానుకోవాలి.
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయాలి.
మరియు కంటి నిండా నిద్రపోవాలి.తద్వారా పైల్స్ వ్యాధి నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.