గేమ్ ఛేంజర్ లీక్ వెనుక ఉన్నది వాళ్లేనా.. అడిగిన డబ్బు ఇవ్వలేదనే అలా చేశారా?

చరణ్( Ram Charan ) శంకర్( Shankar ) కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ( Game Changer Movie ) ఈ నెల 10వ తేదీన థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది.

 Who Is Behind Game Change Movie Leak Details, Ram Charan, Shankar, Game Changer-TeluguStop.com

అయితే గేమ్ ఛేంజర్ సినిమా విడుదలైన రోజే ఆన్ లైన్ లో లీకై ఫ్యాన్స్ కు షాకిచ్చింది.ఈ సినిమాకు సంబంధించిన హెచ్డీ ప్రింట్ లీక్ కావడం ఫ్యాన్స్ ను బాధ పెట్టింది.

గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో కొంతమంది బెదిరింపులకు పాల్పడటంతో చిత్ర బృందం సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది.తాము అడిగిన డబ్బు ఇవ్వకపోతే గేమ్ ఛేంజర్ ను లీక్ చేస్తామని బెదిరించిన వాళ్లపై పోలీసులు కేసు నమోదు చేసి ఈ కేసు గురించి దర్యాప్తు చేస్తున్నారు.

సినిమా రిలీజ్ కు ముందే నిర్మాతలతో పాటు కొందరు కీలక వ్యక్తులకు వాట్సాప్, సోషల్ మీడియా వేదికగా బెదిరింపు కాల్స్ వచ్చాయని చిత్ర బృందం ఫిర్యాదు చేసింది.

Telugu Game Changer, Gamechanger, Ram Charan, Ramcharan, Shankar, Tollywood-Movi

మూవీ రిలీజ్ కు రెండు రోజుల ముందే కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని మూవీ రిలీజైన రోజే ఆన్ లైన్ లో లీక్ చేశారని 45 మందితో కూడిన ముఠాపై చిత్ర బృందం ఫిర్యాదు చేయడం గమనార్హం.ఈ ముఠా వెనుక ఉన్నది ఎవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.

Telugu Game Changer, Gamechanger, Ram Charan, Ramcharan, Shankar, Tollywood-Movi

సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్న కొన్ని అకౌంట్ల విషయంలో కూడా మేకర్స్ దర్యాప్తు చేసిందని సమాచారం అందుతోంది.గేమ్ ఛేంజర్ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్( Amazon Prime ) కొనుగోలు చేసిందని సమాచారం అందుతోంది.గేమ్ ఛేంజర్ సినిమాలో యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube