ఒంట్లో అధిక కొవ్వు పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.అధిక కొవ్వు కారణంగా ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, లివర్ సమస్యలు, కీళ్ల నొప్పులు ఇలా ఎన్నో జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.
కాబట్టి ఒంట్లో కొవ్వును( Body Fat ) కరిగించుకోవడం చాలా అవసరం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.
డైలీ మార్నింగ్ ఈ డ్రింక్ ను తాగితే ఒంట్లో కొవ్వు ఖేల్ ఖతం అవ్వాల్సిందే.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు జీలకర్ర,( Cumin Seeds ) నాలుగు టేబుల్ స్పూన్లు వాము, నాలుగు టేబుల్ స్పూన్లు సోంపు( Fennel Seeds ) వేసుకోవాలి.
అలాగే అంగుళం దాల్చిన చెక్కను రెండు నుంచి మూడు చొప్పున వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి.ఇలా ఫ్రై చేసుకున్న పదార్థాలను మిక్సీ జార్ లో మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఆపై ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ మరియు హాఫ్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పౌడర్ వేసి ఐదు నిమిషాల పాటు మరిగిస్తే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.మరిగించిన నీటిని ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తరువాత సేవించాలి.రోజు మార్నింగ్ ఈ డ్రింక్ తాగితే ఒంట్లో పేరుకుపోయిన ఫ్యాట్ మొత్తం క్రమంగా బర్న్ అవుతుంది.
వెయిట్ లాస్ అవుతారు.అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు.

అలాగే రెగ్యులర్ గా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.అంతేకాకుండా ఈ డ్రింక్ ఒత్తిడి, డిప్రెషన్, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి మానసిక సమస్యలను దూరం చేస్తుంది.హార్మోన్ల సమతుల్యతకు కూడా ఈ డ్రింక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.







