తెల్ల జుట్టు( White hair )తో బాధపడుతున్నారా.? తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు మార్కెట్లో లభ్యమయ్యే ఆర్టిఫిషియల్ కలర్స్ పై ఆధారపడుతున్నారా.? కానీ ఇటువంటి కృత్రిమ రంగులు జుట్టు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కాదు.వీటి వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
అందుకే సహజంగానే తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి.అయితే అందుకు ఉల్లితొక్కలు అద్భుతంగా సహాయపడతాయి.
ఉల్లి తొక్కలు ఎందుకు పనికి రావని దాదాపు అందరూ డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.కానీ, వాటితోనూ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్యను నివారించడానికి ఉల్లి తొక్కలు( Onion peel ) గ్రేట్ గా సహాయపడతాయి.మరి ఇంతకీ ఉల్లి తొక్కలను జుట్టుకు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టు
కుని అందులో ఒక కప్పు ఉల్లి తొక్కలు వేసి నల్లగా మారేంతవరకు ఫ్రై చేసుకోవాలి.ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లి తొక్కలను మిక్సీ జార్ లో వేసి స్మూత్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఉల్లి తొక్కల పొడి, రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడి, రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె, రెండు టేబుల్ స్పూన్లు ఆముదం, రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( coconut oil ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.తెల్ల జుట్టును రిపేర్ చేయడానికి ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.పైగా ఈ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.కాబట్టి తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.