ఖర్జూరాలు.వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తియ్యగా, రుచిగా ఉండే ఖర్జూర పండ్లను పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటుంటారు.చూడటానికి ఈతపండులా ఉండే ఖర్జూరం పండ్లలో పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి.
విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్; పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ఫోలిక్‌యాసిడ్, ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఇలా ఎన్నో పోషకాలు ఖర్జూరాల్లో దాగి ఉంటాయి.
అందుకే ఖర్జూరాలను డైలీ డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతుంటారు.
అయితే కొందరు రుచిగా ఉన్నాయనో, ఆరోగ్యానికి మంచివనో ఖర్జూరాలను కాస్త ఎక్కువగానే లాగించేస్తుంటారు.కానీ, ఇలా చేయడం చాలా పొరపాటు.
ఖర్జూరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ అతిగా తీసుకంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ముఖ్యంగా ఖర్జూరాల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.
అందువల్ల, ఖర్జూరాలను ఓవర్‌గా తీసుకుంటే.బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
అలాగే ఖర్జూరాలు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండేందుకు వ్యాపారదారులు వాటిలో కొన్ని రసాయనాలు కలుపుతారు.అందువల్ల, ఖర్జూరాలను అతిగా తీసుకుంటే కడుపు నొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం, డయేరియా వంటి సమస్యలు ఏర్పడతాయి.

ఇక ఖర్జూరాల్లో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది.ఫైబర్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ ఎక్కువగా తీసుకుంటే కళ్లు తిరగడం, మలబద్ధకం, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, ఉన్నట్టు ఉండి కడుపు నొప్పి, కడుపులో మంట లాంటి సమస్యలు ఎదురవుతాయి.అలాగే ఖర్జూరాలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల.అందులో ఉండే పొటాషియం హైపర్ ల్యూకేమియా సమస్యకు దారితీసేలా చేస్తుంది.ఖర్జూరాల్లో సహజంగానే తియ్యగా ఉంటాయి.అందువల్ల, వీటిని అధికంగా తీసుకుని బ్లాడ్ షుగర్ లెవల్స్‌పై ప్రభావం పడుతుంది.
సో ఖర్జూరాలను అదుపులో తీసుకుంటే మంచిది.