టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) అలాగే హీరో నాగచైతన్య ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఊహించని విధంగా విడాకులు తీసుకొని విడిపోయిన ఆ విషయం తెలిసిందే.వీరి అధ్యయనం ముగిసిపోయింది.
అయితే నాగచైతన్య రెండవ వివాహం చేసుకోక ముందు వరకు కూడా వీరిద్దరూ ఎప్పటికైనా కలుస్తారని అభిమానులు కూడా ఎంతో ఆశతో ఎదురు చూశారు.వీరిద్దరు విడిపోయినప్పటికీ వీరిద్దరికీ సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి.
ఇదిలా ఉంటే నాగచైతన్య తాజాగా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాగా సమంత నుంచి విడిపోయిన తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న నాగ చైతన్య గత ఏడాది మరోసారి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
హీరోయిన్ శోభితతో( heroine Shobhita ) కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.ప్రస్తుతం వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇంతకీ చైతన్య తన పోస్టులో ఏమి రాసుకొచ్చాడు అన్న విషయానికి వస్తే.సమంతతో కలిసున్న టైంలో హాష్ అనే ఫ్రెంచ్ బుల్ డాగ్ ని పెంచుకున్నారు.
ఇప్పుడది చైతూ దగ్గరే ఉంది.తాజాగా చైతన్య ఆదివారం ఇలా గడిచింది అని ఒక పోస్ట్ పెట్టాడు.
ఇందులో తన కారుని రిపేర్ చేసుకోవడంతో పాటు శోభిత పెట్ డాగ్ హాష్ కలిసున్న ఫొటోని కూడా షేర్ చేశాడు.అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న సమంత ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.సామ్ పెంచుకున్న కుక్క.శోభితతో ఏం చేస్తోందని ఒకరంటే.శుభం ట్రైలర్ రిలీజైందని, రేపు సమంత పుట్టినరోజు కావడంతో కావాలనే చైతూ ఈ పోస్ట్ పెట్టాడని మరికొందరు అంటున్నారు.సమంత లానే హాష్ కూడా ఒంటరిది అయిపోయిందని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.
ప్రస్తుతం ఆ పోస్ట్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు.మరి ఈ కామెంట్స్ నాగ చైతన్య ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.