రక్తహీనత.పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కోట్లాది మందిని సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.
రక్తహీనత అనేది మొదట చిన్న సమస్యగానే కనిపించిన నిర్లక్ష్యం చేస్తే దాని కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అందుకే రక్తహీనతను వీలైనంత త్వరగా వదిలించుకునేందుకు ప్రయత్నించాలి.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది.రెండంటే రెండు వారాల పాటు రెగ్యులర్‌గా ఈ జ్యూస్ ను తీసుకుంటే రక్తహీనత నుంచి చాలా త్వరగా బయట పడతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేయండి.ముందుగా ఒక దానిమ్మ పండు తీసుకుని తొక్క తొలగించి లోపల ఉండే గింజలను వేరు చేయాలి.
అలాగే ఒక గ్రీన్ యాపిల్ తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ ఆపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, మూడు నైట్ అంతా నీటిలో నానబెట్టుకున్న డ్రై అంజీర్, ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె ను మిక్స్ చేసి తాగేయడమే.

ఈ జ్యూస్ ను రోజుకు ఒకసారి కనుక తీసుకుంటే అందులో ఉండే పోషక విలువలు కొద్ది రోజుల్లోనే రక్తహీనతను తరిమి కొడతాయి.అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల నీరసం, అలసట వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.
రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.చర్మం షైనీ గా సైతం మెరిసిపోతుంది.
కాబట్టి తప్పకుండా రక్తహీనతతో బాధపడేవారు ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోండి.