బీట్ రూట్.దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన దుంపల్లో బీట్ రూట్ ఒకటి.బీట్ రూట్ లో అనేక పోషకాలు నిండి ఉంటాయి.
అవి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయి.ముఖ్యంగా బీట్ రూట్ ను రోజు ఉదయం ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే వెయిట్ లాస్ తో పాటు ఊహించని లాభాలెన్నో మీ సొంతం అవుతాయి.
అందుకోసం ముందుగా ఒక బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో బీట్ రూట్ ముక్కలు, అర కప్పు ఫ్రెష్ ఆరెంజ్ పల్ప్, మూడు లేదా నాలుగు కీర దోసకాయ స్లైసెస్, అర కప్పు తరిగిన పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి.
చివరిగా ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన బీట్ రూట్ ఆరెంజ్ కీరా పైనాపిల్ జ్యూస్ సిద్ధం అవుతుంది.
ఆరోగ్యానికి ఈ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది.ఉదయం ఒక గ్లాసు చొప్పున ఈ జ్యూస్ ను నిత్యం తీసుకుంటే మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి.ఈ జ్యూస్ శరీరంలో అధిక క్యాలరీలు కరిగించి వెయిట్ లాస్ కు అద్భుతంగా తోడ్పడుతుంది.బాడీకి అవసరం అయ్యే ఐరన్ ను అందించి రక్తహీనతను తరిమికొడుతుంది.అలాగే ఈ జ్యూస్ లో విటమిన్ సి తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి.అందువల్ల ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
దీంతో అనేక జబ్బులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
అంతేకాదు ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది.
లివర్ ఆరోగ్యంగా మారుతుంది.రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.
శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది.
మరియు చర్మం కాంతివంతంగా మారుతుంది.స్కిన్ టోన్ సైతం మెరుగు పడుతుంది.
కాబట్టి తప్పకుండా ఈ హెల్తీ జ్యూస్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.