శ్రీ మహావిష్ణువు ( Shri Mahavishnu )ఎనిమిదవ అవతారమే కృష్ణుడిగా జన్మించిన పర్వదినాన్ని అందరూ కృష్ణాష్టమి( Krishnashtami ) అని అంటారు.దేవకి మరియు వాసుదేవతలకు ఎనిమిదవ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు.
ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది కృష్ణాష్టమి ఈ నెల 6,7 తేదీలలో జరుపుకుంటున్నారు.పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 6వ తేదీన ఉదయం 7.57 నిమిషములకు అష్టమి తిధి ప్రారంభమవుతుంది.ఇక అదే రోజున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు రోహిణి నక్షత్రం కూడా వస్తూ ఉంది.
అందుకే కృష్ణాష్టమి ఆరవ తేదీన జరుపుకోవాలని పండితులు ( Scholars )చెబుతున్నారు.

కానీ వైష్ణవులు మాత్రం కృష్ణాష్టమిని ఏడవ తేదీన జరుపుకోవాలని చెబుతున్నారు. కృష్ణాష్టమి చేసుకోవాలనుకునే వారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులను ధరించి, ఆ తర్వాత ఇంటిని మరియు తమ పూజగదిని శుభ్రం చేసుకోవాలి.ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఉండే ప్రతి గడపకు కూడా పసుపు రాసి, కుంకుమ పెట్టి ఇంటికి తోరణాలు కట్టాలి.
పూజ గదిలో ముగ్గు వేయడం మరిచిపోకూడదు.ముఖ్యంగా కన్నయ్యనీ ఇంటికి స్వాగతిస్తూ కృష్ణుడి పాదాల అడుగులు వేస్తారు.
ఇంకా చెప్పాలంటే కృష్ణుడికి తులసీదళాలు అంటే ఎంతో ఇష్టం.

అందువల్ల తులసిమాలని మెడలో వేయాలి.కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి పూజలు చేసేటప్పుడు పారిజాత పుష్పాల( Parijata flowers )ను ఉపయోగించడం ఎంతో మంచిది.ఆ తర్వాత కృష్ణుడి విగ్రహాన్ని ఉయ్యాలలో ఉంచి లాలిపాట పడుతూ పూజ చెయ్యాలి.
ముఖ్యంగా చెప్పాలంటే కృష్ణాష్టమి రోజున ఒక పూట ఉపవాసం చేస్తే కూడా ఎంతో మంచిది. కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడి ఆలయాలకు వెళ్లి పూజ చేయించడం చాలా మంచిది.
ప్రతిరోజు కూడా కృష్ణునికి పూజ చేయడం వల్ల పాపాలు తొలిగిపోతాయి.అంతేకాకుండా సంతానం లేని వారు, వివాహం కాని వారు కృష్ణాష్టమి రోజున కృష్ణుడినీ గోపాల మంత్రంతో పూజించడం వల్ల మంచి జరుగుతుంది.