చూసి చూడగానే ముద్దొచ్చే బంతిపూల గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.ఏదైనా పండగా వచ్చినా, ఇంట్లో ఫంక్షన్ వచ్చినా.
బంతిపూలు విరివిగా కొనుగోలు చేస్తారు.అయితే బంతిపూలు కేవలం అలంకరణకే కాదు.
సౌందర్య పరంగా కూడా ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి.ముఖ్యంగా చర్మ ఛాయను పెంచడంలోనూ, చర్మాన్ని మృదువుగా మార్చడంలోనూ, చర్మం కాంతిని పెంచడంలోనూ ఇలా అనేక విధాలుగా బంతిపూలు ఉపయోగపడతాయి.
మరి ఇంతకీ బంతిపూలను చర్మానికి ఎలా యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కొన్ని బంతిపూల రేకలు, కొన్ని గులాబి రేకలు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ పేస్ట్‌లో కొద్దిగా పసుపు మరియు పచ్చి పాలు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి.
ఇరవై లేదా ముప్పై నిమిషాల అనంతరం కోల్డ్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.మీ చర్మ ఛాయ మెరుగు పడుతుంది.
అలాగే ముఖంపై ముడతలు, సన్నని గీతలు ఉన్న వారు.బింతిపూల రేకులను బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి.ఆ బంతిపూల పొడిలో కొద్దిగా పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖంపై పూతలా వేసుకుని.అర గంట పాటు ఆరనివ్వాలి.
ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేస్తే.
ముఖంపై ముడతలు, సన్నని గీతలు పోయి మృదువుగా మారుతుంది.
ఇక కొన్ని బింతిపూల రేకులను తీసుకుని లైట్‌గా క్రష్ చేసి పాలలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
ఉదయాన్నే దాన్ని పేస్ట్ చేసుకుని.చివరిగా నిమ్మ రసం పిండుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పావు గంట పాటు వదిలేయాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల ముఖంపై మృత కణాలు పోవడంతో పాటు.
చర్మ కాంతి కూడా పెరుగుతుంది.