కిడ్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు..

ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలలో కిడ్నీ అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా కిడ్నీ ఆరోగ్యం ఎంతో బాగా ఉండాలి.

 These Habits That Can Damage Your Kidney Details, Habits , Damage Your Kidney, K-TeluguStop.com

ఎందుకంటే శరీరంలో కిడ్నీ ప్రాముఖ్యత అలాంటిది.మన శరీరంలోని విషపదార్థాలను బయటకి పంపే పనిని కిడ్నీ మాత్రమే చేయగలదు.

అందుకే కిడ్నీ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడం అనేది ఆ వ్యక్తి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.శరీరంలోని విషపదార్థాలను తొలగించి బ్లాడర్ కు పంపిస్తుంది.

ఈ కిడ్నీ అక్కడి నుండి మూత్రం ద్వారా ఆ విషపదార్థాలు బయటికి వస్తాయి.అయితే కొన్ని కొన్ని అలవాట్ల వల్ల కిడ్నీలలో అనేక సమస్యలు ఏర్పడుతుంటాయి.

అయితే ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే మన జీవితంలో ఆహార పలవాట్ల వల్ల కిడ్నీ ఆరోగ్యానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది.

కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లు కూడా బాగుండాలి.అందుకే కిడ్నీ ఆరోగ్యం కోసం జంక్ ఫుడ్, స్వీట్స్ కి దూరంగా ఉండాలి.ఎందుకంటే జంక్ ఫుడ్ లో సోడియం అంటే ఉప్పు ఎక్కువగా ఉంటుంది.ఇది కిడ్నీ పై ప్రభావం చూపిస్తుంది.

అలాగే స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల స్థూలకాయం లాంటి సమస్య తలెత్తుతుంది.

Telugu Damage Kidney, Hours Sleep, Habits, Halthy Habits, Tips, Healthy Kidney,

అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది.అలాగే నీళ్లు తక్కువగా తాగే అలవాటు వల్ల కూడా కిడ్నీ లపై ప్రభావం పడుతుంది.అందుకే అధిక మోతాదులో నీళ్లు తాగితే శరీరపు వ్యర్థ పదార్థాలు అన్ని సులభంగా బయటకు వచ్చేస్తాయి.

అలా కాకుండా తక్కువగా నీళ్లు తాగితే కిడ్నీలపై దుష్ప్రభావం పడుతుంది.అదే విధంగా మన ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుండాలంటే రోజుకు కనీసం 8 గంటలు మంచి నిద్ర మన శరీరానికి ఎంతో అవసరం.

తగిన నిద్ర లేకపోతే మన ఆరోగ్యంపై ప్రభావం చూపించడమే కాకుండా కిడ్నీలపై కూడా ప్రభావం చూపిస్తుంది.తక్కువగా నిద్రపోతే కిడ్నీ ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది.  దీంతో కిడ్నీపై ఒత్తిడి పెరుగుతుంది.అందుకే ప్రతిరోజు సరిపడేంత నిద్ర ఉంటే మన ఆరోగ్యానికి అలాగే కిడ్నీ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube