సాధారణంగా ఒక సినిమాలో హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే డైరెక్టర్ తాను రాసుకున్న పాత్రకు సూట్ అయ్యే నటి కనిపెట్టాలి.కొన్నిసార్లు ఆ పాత్రకు తగిన వాళ్లు దొరక ఇబ్బందులు పడుతుంటారు.
వేరే వాళ్ల సలహాలు అడుగుతుంటారు.అలా వేరే వాళ్ల సలహాలతో కొన్ని సినిమాల్లో కొందరు హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్నారు.వారు ఎవరో తెలుసుకుందాం.
• సోనూసూద్ – అనుష్క
హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సూపర్ (2005)( Super Movie ) నాగార్జున కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమాగా మిగిలిపోయింది.పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సోనూసూద్,( Sonu Sood ) అనుష్క శెట్టి,( Anushka Shetty ) అయేషా టకియా ప్రధాన పాత్రల్లో నటించారు.ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటే అనుష్క శెట్టి ఒక హీరోయిన్ గా చేసింది.
ఆ హీరోయిన్ రోల్ కోసం ఎవరినైనా రికమెండ్ చేయమని పూరి జగన్నాథ్ అడగక సోనూసూద్ తను జిమ్‌లో రోజూ చూసే అనుష్క శెట్టి పేరు చెప్పారు.అలా అనుష్క “సూపర్” సినిమాలో అవకాశం దక్కించుకుంది.
దీనితోనే ఆమె తెలుగులో అడుగు పెట్టింది.
• పి.సి.శ్రీరామ్ – మోహిని
1991లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ మూవీ ఆదిత్య 369( Aditya 369 ) ఎంత పెద్ద హిట్ అయిందా స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు బాలకృష్ణ ఫ్యాన్స్‌కి బాగా నచ్చిన సినిమాల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది.సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ, మోహిని( Mohini ) హీరోహీరోయిన్లుగా నటించారు.నిజానికి మేకర్స్ మొదట్లో హీరోయిన్‌గా విజయశాంతిని అనుకున్నారు.ఆమెను సంప్రదిస్తే వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీకి సంతకం చేయలేకపోయింది.
ఎవరిని తీసుకుందామా అని డైరెక్టర్ ఆలోచిస్తున్నప్పుడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్( P.C.Sreeram ) తన బంధువు మోహినిని తీసుకోవాలని సలహా ఇచ్చాడు.ఆమెకు కెమెరా ముందు నటించడం కొత్తవి కాదు అందంగా కూడా ఉండడంతో హీరోయిన్ గా ఆమెని ఎన్నుకున్నారు.ది టైమ్ మిషన్ అనే నావెల్ ఆధారంగా ఈ సినిమా తీశారు.
• ఎంఎం కీరవాణి – సలోని
మగధీర( Magadheera ) సినిమా కోసం సలోనిని( Saloni ) అప్రోచ్ అయినప్పుడు ఆమె హీరోయిన్ ఛాన్స్ వస్తుందేమో అని ఆశ పడింది.తర్వాత అసలు సంగతి తెలిసి బాధపడింది.తనకు న్యాయం చేయాలంటూ కీరవాణిని కోరుకుంది.అయితే ఆయన మర్యాద రామన్న సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని రాజమౌళికి చెప్పాడు.రాజమౌళి ఆమెనే హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నాడు.