మాతృత్వం అనేది ఒక వరం.పెళ్లి తర్వాత ఆ వరాన్ని పొందాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.
కోరుకున్నట్టుగానే అమ్మాయి అమ్మగా మరిప్పుడు ఆమె అనుభూతిని, ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము.ఇకపోతే ప్రసవం అనంతరం బిడ్డకు దాదాపు ఆరు నెలల పాటు తల్లిపాలు చాలా కీలకం.
పిల్లల పెరుగుదలకు అవసరమైన పోషకాలు మరియు రోగనిరోధక శక్తి ( Immunity )అభివృద్ధికి ముఖ్యమైన ప్రతిరోధకాలను తల్లిపాలు ద్వారానే పొందుతారు.అయితే కొందరికి తల్లిపాలు సరిగ్గా ఉండవు.
అలాంటి వారిలో పాల ఉత్పత్తిని పెంచడానికి మ్యాజికల్ డ్రింక్ ఒకటి ఉంది.ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు( fenugreek ), హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర( cumin ), హాఫ్ టేబుల్ స్పూన్ వాము( Ajwin ) వేసుకోవాలి.అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టాలి.
మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి మెంతులు, వాము, జీలకర్ర నానబెట్టుకున్న గిన్నెను పెట్టి ఉడికించాలి.

దాదాపు పది నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.గోరువెచ్చగా అయిన తర్వాత ఈ వాటర్ ను సేవించాలి.ప్రసవం అనంతరం రోజు ఉదయం లేదా సాయంత్రం వేళ ఈ వాటర్ తాగితే చాలా లాభాలు పొందుతారు.
జీలకర్ర ఇనుము యొక్క గొప్ప మూలం.ప్రసవానంతర శక్తిని బలోపేతం చేయడానికి జీలకర్ర సహాయపడుతుంది.
అదే సమయంలో జీలకర్ర పాల ఉత్పత్తిని పెంచుతుంది.

అలాగే పాలిచ్చే తల్లులకు వాము అద్భుతాలు చేస్తుంది.వాము పాల ఉత్పత్తిని పెంచుతుంది.డెలివరీ తర్వాత గ్యాస్, అజీర్తి, మలబద్ధకం సమస్యలకు వాము ఉత్తమ నివారణ.
వాములో థైమోల్ పుష్కలంగా ఉంటుంది.ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు లాక్టో జెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.
ఇక మెంతులు కూడా పాల సరఫరాను పెంచుతాయి.మెంతుల్లో పొటాషియం, ఐరన్, కాల్షియం, బీటా-కెరోటిన్, ఒమేగా-3 మొదలైన ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి.
అందువల్లు మెంతులు, వాము, జీలకర్ర వేసి మరిగించిన నీటిని నిత్యం తీసుకుంటే పాల ఉత్పత్తి పెరగడంతో పాటు డెలివరీ నుంచి సైతం త్వరగా కోలుకుంటారు.