ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలంపిక్స్( Paris Olympics ) నేడు 11వ రోజుకు చేరుకున్నాయి.గడిచిన 10 రోజుల్లో ఒలంపిక్స్ లో కేవలం మూడు కాంస్య పతకాలను మాత్రమే భారత్ గెలుచుకోగలిగింది.
ఇకపోతే చివరిసారి టోక్యోలో జరిగిన ఒలంపిక్స్ లో ఎటువంటి అంచనాలు లేకుండా గోల్డ్ మెడల్ సాధించి భారత్ ఖాతాలో చేర్చిన నీరజ్ చోప్రా( Neeraj Chopra ) నేడు తొలిసారి ప్యారిస్ ఒలంపిక్స్ లో తలబడబోతున్నాడు.దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయన పైనే ఉంది.
అయితే నేడు జావెలిన్ ( Javelin )త్రోలో కేవలం పురుషుల పోటీలో చోప్రా, పోటీలో టీనేజర్ జనా జావిలిన్ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.వీటితోపాటు నేడు రెజ్లింగ్ పోటీలలో మహిళా రెజ్లర్ వినేష్ పొగట్ కూడా ఆడబోతోంది.ఇక మరోవైపు హాకీలో టీమిండియా సెమీఫైనల్ లో తెలపడనుంచి.ఇక నేడు పారిస్ ఒలంపిక్స్ 2024లో జరగబోయే భారత షెడ్యూల్ ను ఒకసారి చూస్తే.
మధ్యాహ్నం 1: 30 లకు పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు (ప్రీ-క్వార్టర్ ఫైనల్) మ్యాచ్.చైనా vs భారత్ (హర్మీత్ దేశాయ్, శరత్ కమల్, మానవ్ ఠక్కర్).మధ్యాహ్నం 1: 50 లకు మహిళా జావెలిన్ త్రో (అర్హత)లో కిషోర్ జెనా పాల్గొనుంది.మధ్యాహ్నం 2: 30 లకు మహిళల 68 కేజీల రెపెచేజ్ (రెజ్లింగ్) లో నిషా దహియా అర్హత సాధిస్తే ఆడనుంది.మధ్యాహ్నం 2: 50 లకు మహిళల 400మీ (రెపెచెచె) లో కిరణ్ పహల్ ఆడనుంది.మధ్యాహ్నం 3: 00 లకు మహిళల 50 కిలోల రౌండ్ ఆఫ్ 16 (రెజ్లింగ్)లో వినేష్ ఫోగట్ (అర్హత సాధిస్తే సూపర్-8, సెమీ-ఫైనల్ కూడా) నేడే జరుగుతాయి.ఇక మధ్యాహ్నం 3: 20 లకు పురుషుల జావెలిన్ త్రో (అర్హత) లో నీరజ్ చోప్రా పాల్గొంటాడు.ఇక నేడు రాత్రి 10 :30 లకు పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్ లో భారత్ జర్మనీతో తలపడనుంది.