సాధారణంగా వాలుగా ఉన్న ప్రదేశాల్లో బ్రేక్ వేయకుండా ఆపిన వాహనాలు డ్రైవర్ లేకుండా పరుగులు తీస్తాయి దీనివల్ల ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంది అయితే తాజాగా ఇలాంటి ఓ ప్రమాదాన్ని తప్పించింది ఒక యువతి.ఇటీవల ఒక ప్రాంతంలో ఒక ట్రక్ వాలు ప్రదేశం నుంచి డ్రైవర్ లేకుండానే పరుగులు తీయడం మొదలుపెట్టింది.
అది ఎవరో ఒకరికి ఢీకొడుతుందేమో అనిపించింది దీనివల్ల చాలా పెద్ద ప్రమాదం జరగబోతుందని అర్థమైంది.ఆ సమయంలో అక్కడ నుంచి వెళ్తున్న ఒక యువతి, తన తెలివితో ఆ ట్రక్‌ను ఆపివేసింది.
ఆమె చేతిలో ఏమీ లేకుండా, సాధారణ బ్లూ హుడీ ( Blue hoodie )మాత్రమే వేసుకొని, ట్రక్‌ను ఆపింది.
ఆమె ధైర్యాన్ని చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.ఈ అమ్మాయి చేసిన పనిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.ఒక యువతి ఇంత పెద్ద ప్రమాదాన్ని ఎలా ఆపిందో అని అందరూ ఆలోచిస్తున్నారు.
ఆ ధైర్యవంతమైన యువతి ట్రక్‌లోకి దూకి హ్యాండ్‌బ్రేక్ లాగి ఆ ట్రక్‌ను ఆపేసిన దృశ్యాలను సీసీ కెమెరా రికార్డు చేసింది.ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగానే అది వైరల్ అయిపోయింది.
ఈ వీడియోలో ఆ అమ్మాయి ఎంత ధైర్యంగా, ఎంత వేగంగా ఆ ప్రమాదాన్ని అరికట్టిందో స్పష్టంగా తెలుస్తుంది.ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో కచ్చితంగా తెలియదు కానీ, ఈ వీడియో ఇంటర్నెట్‌లో చాలా చర్చకు దారితీసింది.
ఇదే వీడియోలో ఇద్దరూ మగ వ్యక్తులు ఆ ట్రక్‌ను చేతులతో వెనక్కి లాగడం మనం చూడవచ్చు.వాళ్లు చేతులతో వెనకనుంచి దానిని లాగడం ఫన్నీగా అనిపిస్తుంది.చూస్తుండగానే అది వెంటనే కంట్రోల్ తప్పడం, ఏం చేయాలో తెలియక డ్రైవరు, హెల్పర్ ఇలా ప్రవర్తించడం జరిగింది.ఎక్స్ యూజర్ ఘర్ కే కాలేష్ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 10,000 కు పైగా వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి.
చాలామంది ఆ అమ్మాయి ధైర్యాన్ని పొగుడుతున్నారు.దీన్ని మీరు కూడా చూసేయండి.