అధిక హెయిర్ ఫాల్ తో కలవర పడుతున్న పురుషులకు టాప్ అండ్ బెస్ట్ హోమ్ రెమెడీ ఇదే!

హెయిర్ ఫాల్( Hair fall ) అనేది ఆడవారిని ఎంత కలవర పెడుతుందో మగవారిని అంతకంటే ఎక్కువ కలవరపెడుతుంది.అందులోనూ పెళ్ళి కాని పురుషులు హెయిర్ ఫాల్ కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.

 This Is The Top And Best Home Remedy For Men Who Suffered With Excessive Hair Fa-TeluguStop.com

జుట్టును కాపాడుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అధిక హెయిర్ ఫాల్ తో సతమతం అవుతున్నారా.? అయితే అస్సలు వర్రీ అవకండి.ఇప్పుడు చెప్పబోయే టాప్ అండ్ బెస్ట్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే జుట్టు రాలే సమస్యకు టాటా చెప్పవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఉసిరి పొడిని( Amla powder ) వేసుకోవాలి.ఉసిరి జుట్టుకి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

ఉసిరిలో ఉండే ఔషధ గుణాలు జుట్టు ఆరోగ్యానికి అండగా ఉంటాయి.ఉసిరి పొడి వేసుకున్న తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు పాలు( milk ), వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె,( coconut oil ) వన్ టేబుల్ స్పూన్ బాదం నూనె( Almond oil ), రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Healthy, Remedy, Topremedy-Telugu Health

చివరిగా ఒక వైట్ ను వేసుకుని మరోసారి కలుపుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి కేవలం ఒక్కసారి ఈ ఆమ్లా ఎగ్ మాస్క్ ను కనుక వేసుకుంటే హెయిర్ ఫాల్ అన్న మాట మీ నోట రాదు.

Telugu Care, Care Tips, Fall, Healthy, Remedy, Topremedy-Telugu Health

ఉసిరి, గుడ్డు, బాదం నూనె, కొబ్బరి నూనె, పెరుగు మరియు పాలులో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.బలహీనమైన జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తాయి.జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడతాయి.అలాగే ఈ ఆమ్లా ఎగ్ మాస్క్ చుండ్రు, దురద, జుట్టు ఇన్ఫెక్షన్లను తగ్గించి కురుల పెరుగుదలకు మద్దతు ఇస్తుంది.కాబట్టి అధిక హెయిర్ సమస్యతో బాధపడుతున్న పురుషులు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube