ఈ టౌన్‌లో రిటైర్‌మెంట్ లైఫ్ గడుపుతున్న ముసలి పిల్లులు.. ఎక్కడంటే..?

ప్రపంచంలో దాదాపు 60 కోట్ల పిల్లులు ఉన్నాయి.వీటిలో చాలా పిల్లులు ఏటా అనాధ శరణాలయాలకు చేరుకుంటాయి.

 Shropshire Cat Rescue A Retirement Village For Old Cats In Uk Details, Cats, Old-TeluguStop.com

ఈ పిల్లులలో 5% మాత్రమే తమ యజమానులను తిరిగి కలుసుకుంటాయి, 37% పిల్లులను ఇతరులు దత్తత తీసుకుంటారు.దురదృష్టవశాత్తు, ఈ శరణాలయాలలో ఉన్న పిల్లులలో దాదాపు 41%, ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న పిల్లులను( Old Cats ) చంపేస్తారు.

ఇంగ్లాండ్‌లోని శ్రాప్‌షైర్‌ క్యాట్‌ రెస్క్యూ( Shropshire Cat Rescue ) అనే సంస్థ ముసలి పిల్లులకు రెండవ జీవితాన్ని ఇస్తుంది.ఈ సంస్థ యూకేలోని( UK ) శ్రూస్‌బరీ టౌన్‌లో ఉంది.

ఇక్కడ ఓల్డ్ క్యాట్స్‌, అనారోగ్యంతో ఉన్న పిల్లులు తమ జీవితాంతం సురక్షితంగా ఉండగలవు.ఇతరులు ఇంటికి తీసుకెళ్లలేని ఈ పిల్లులకు ఇది ఒక సేఫ్ హెవెన్ లాంటిది.

ఛారిటీని సహ-స్థాపించిన మారియన్ మిక్లెరైట్( Marion Micklewright ) 1990లో ముసలి పిల్లులను ఎవరూ దత్తత తీసుకోకపోతే వాటిని చంపేస్తున్నారని గమనించారు.తర్వాత, మేరియన్ శ్రాప్‌షైర్ క్యాట్ రెస్క్యూను ప్రారంభించారు.2009లో, దాతల నుంచి వచ్చిన సహాయంతో రిటైర్మెంట్ విలేజ్‌ను నిర్మించారు.“మా వద్దకు ఓల్డ్ క్యాట్స్‌ ఎక్కువగా వస్తున్నాయి.వీటికి ఆరోగ్య సమస్యలు ఉండటం లేదా వృద్ధాప్యం వల్ల ఎవరూ వీటిని ఇంటికి తీసుకెళ్లడానికి ఇష్టపడకపోవడం వల్ల వీటిని ఇతర చోట్లకు మార్చడం కష్టంగా ఉంది” అని ఆమె చెప్పారు.

శ్రాప్‌షైర్ క్యాట్ రెస్క్యూలో దీర్ఘకాలంగా వాలంటీర్‌గా పనిచేస్తున్న సూజీ ఫిలిప్స్, “పిల్లులు చిన్న గదుల్లో ఎక్కువ సమయం గడుపుతున్నాయి కాబట్టి, మారియన్ వాటికి ఎక్కువ స్థలం ఇవ్వాలని అనుకున్నారు” అని చెప్పారు.రిటైర్మెంట్ విలేజ్‌లో ఆరు కుటీరాలు ఉన్నాయి.ప్రతి కాటేజ్‌లో నాలుగు పిల్లులు ఉండగలవు.అలాగే, వృద్ధాప్యంలో ఉన్న పిల్లులు కలిసి ఆడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ‘మోగీస్ మాన్షన్’ అనే ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది.“కాటేజీలు అన్నీ ఒకేలా ఉంటాయి కానీ వేర్వేరు రంగుల్లో ఉంటాయి.పిల్లులు తాము ఇష్టపడే కాటేజీని ఎంచుకుంటాయి” అని ఫిలిప్స్ వివరించారు.

బోర్డ్ పాండా ప్రకారం, శ్రాప్‌షైర్ క్యాట్ రెస్క్యూలో ప్రస్తుతం 17 పిల్లులు ఉన్నాయి.

ఈ సంస్థ గత కొన్ని సంవత్సరాలలో 8000 కంటే ఎక్కువ పిల్లులు, పిల్లలను చూసుకుంది.కొన్ని పిల్లులు తమకు ఇష్టం వచ్చిన ఇంటిని ఎంచుకుంటాయి.అలాగే, లోకల్ కిడ్స్ కూడా ఇక్కడ వచ్చి పిల్లులతో ఆడతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube