బద్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్( Puri Jagannath ) మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక ఆ సినిమా చేసిన వెంటనే ఆయన జగపతిబాబు తో చేసిన బాచి సినిమా ( Bacchi movie )ఫ్లాప్ అయింది.
ఇక ఆ తర్వాత రవితేజతో వరుసగా మూడు సినిమాలు చేశాడు.అవి మూడు కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఒక్కసారిగా ఆయన ఇండస్ట్రిలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
మరి ఇలాంటి సమయంలో ఒక 20 సంవత్సరాల పాటు ఆయన ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా స్టార్ హీరోలందరితో సినిమాలు చేశాడు.ఇక ఇప్పుడు కూడా మరోసారి స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే తను ఇప్పుడు రామ్ తో చేస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’( Double ISmart ) సినిమాతో తప్పకుండా సక్సెస్ అయితే సాధించాలి.
ఒకప్పుడు కామెడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న దర్శకుడు శ్రీను వైట్ల( Director Srinu Vaitla )…కమర్షియల్ సినిమాలను తీయడం లో ఈయనకి మంచి పేరు ఉంది.యాక్షన్ ఎంటర్ టైనర్ల లో కామెడీని కూడా పండిస్తూ సినిమాలను సక్సెస్ చేయొచ్చు అని నిరూపించిన ఒకే ఒక దర్శకుడు ఈయన… ఇక ఈయన కూడా ఇప్పుడు ప్లాపుల్లో ఉన్నాడు.కాబట్టి తను ఇప్పుడు గోపీచంద్( Gopichand ) చేస్తున్న విశ్వం సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే ఆయన టాప్ డైరెక్టర్ గా మరోసారి గుర్తింపు సంపాదించుకుంటాడు.అలాగే స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసే అవకాశం అయితే దక్కుతుంది.
ఇక ఇదిలా ఉంటే వీరిద్దరే కాకుండా వి వి వినాయక్ ( V V Vinayak )కూడా తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.చిరంజీవి తో చేసిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఆ తర్వాత చేసిన ‘ఇంటెలిజెంట్ ‘ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు.ఇక ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో బాలీవుడ్ లో ఛత్రపతి సినిమాను రీమేక్ చేశాడు.కూడా తను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది…
.