నిద్రను నిర్లక్ష్యం చేయడం, అధిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, వయసు పై పడటం, గంటలు తరబడి లాప్ టాప్స్ ముందు వర్క్ చేయడం, టీవీలు చూడటం, మొబైల్ ఫోన్స్ ను వినియోగించడం తదితర కారణాల వల్ల కళ్ళ కింద నలుపు మరియు ముడతలు వంటివి ఏర్పడుతుంటాయి.ఇవి ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
ఈ క్రమంలోనే వాటిని వదిలించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే సీరంను మీరు వాడాల్సిందే.ఈ సీరం కళ్ల కింద నలుపుతో పాటు ముడతలను వదిలించడంలో ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.
మరి ఇంతకీ ఆ సీరంను ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ బీన్స్ వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో అరకప్పు స్వీట్ ఆల్మండ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకోవాలి.
అలాగే అందులో రెండు టేబుల్ స్పూన్ల గ్రైండ్ చేసి పెట్టుకున్న కాఫీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై మూత పెట్టి చల్లని ప్రదేశంలో ఉంచాలి.
రెండు రోజులకు ఒకసారి స్పూన్ తో మిక్స్ చేస్తూ ఉండాలి.వారం రోజుల అనంతరం పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ మరియు నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు కాఫీ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేస్తే మన సీరం సిద్ధం అయినట్టే.

ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ సీరంను కళ్ళ కింద అప్లై చేసి సున్నితంగా వేళ్ళతో ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకుని పడుకోవాలి.ప్రతిరోజు ఈ సీరంను కనుక వాడితే కళ్ళ కింద నలుపు పోవడమే కాదు ముడతలు సైతం క్రమంగా దూరమవుతాయి.