సినిమా పరిశ్రమ అంటేనే వివాదాలు అనే మాట కొన్నాళ్ల నుంచి నిజమౌతూ వస్తుంది.అనేకమంది హీరోయిన్స్ అలాగే ఆర్టిస్టులు, సింగర్స్ తమకు అవకాశాలు ఇస్తున్నారు అనే నెపంతో తమను వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు అంటూ తరచుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
మీటు మూమెంట్ వచ్చిన తర్వాత వారికి ఎదురైనా అనేక పరిస్థితులను బయట పెడుతున్నారు సదరు ఆర్టిస్టులు.తమకు జీవితంలో ఎదురైన అవమానాలను ఇబ్బందులను బయటకు చెప్పడానికి ఎలాంటి సంకోచం లేకుండా చెప్పేస్తున్నారు.
సందర్భం వచ్చిందంటే సినిమా అవకాశాలు రాకపోయినా సరే తాము పడ్డ బాధలను బయట పెట్టేస్తున్నారు.
ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా ఇలా ఇబ్బంది పడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయట.
దీంతో చిన్నవాళ్లు, పెద్దవాళ్లు అనే తేడా లేదు.ఎలాంటి స్టార్ స్టేటస్ ఉన్నా కూడా ఎవరి దగ్గర ఒకసారైనా ఇబ్బంది పడాల్సి వస్తుందట.అయితే నాలుగు సినిమాలు ఇట్టు కొట్టిన ఒక దర్శకుడు తన సినిమాల్లో నటించే హీరోయిన్స్ ని ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు అనే ప్రచారంలో జోరు అందుకుంది.50 ఏళ్ల వయసులో అతనికి పోయేకాలం ఏంటి అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.టాలీవుడ్ లో అతని గురించి అందరికీ తెలుసు అతడు అందరితో అలాగే ప్రవర్తిస్తారు అని ఏకీభవించే వాళ్ళు కూడా ఉన్నారు.అతడొక ఒక స్టార్ డైరెక్టర్ అన్న విషయాన్ని మర్చిపోయి కమిట్మెంట్ అడగడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
అతని భారిన పడిన హీరోయిన్లలో ఒకప్పటి హీరోయిన్ మాధవి లత తో పాటు ప్రస్తుతం హోస్టుగా వ్యవహరిస్తున్ననటి పూర్ణ కూడా ఉండడం విశేషం.మాధవి లత అయితే తను ఎదుర్కొన్న ఇబ్బందులను మీడియా ముందు ఏకరువుపెట్టింది.ఆ దర్శకుడి సినిమాలో నటిస్తున్న సమయంలో తనను ఎంతగానో హింసించారని క్యారవాన్ కూడా ఇవ్వలేదని, ఎండలో కూర్చోబెట్టాడని, చీప్ హోటల్ ఇచ్చాడని ఆ దర్శకుడు పేరు సైతం ఇండైరెక్ట్ గా చెప్పేసింది.అయితే కేవలం మాధవి లత మాత్రమే కాదు పూర్ణ కూడా అతడి లిస్ట్ ల్ ఉందనే విషయం ఇటీవల కాలంలోనే తెలిసింది.
పూర్ణ అయితే ఆ దర్శకుడు పేరు బయట పెట్టకుండానే తన సన్నిహితుల దగ్గర అతని గురించి అనేక విషయాలు చెబుతుందట.ఒక్క సినిమాలో నటించిన మాత్రాన అతడు ఆమెను ఎంతగానో ఇబ్బంది పెట్టారనే టాక్ బయట కూడా నిజమే అని తెలుస్తోంది.