సనాతన ధర్మంలో వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవునికి అంకితం చేయబడి ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.అలాగే శుక్రవారం రోజుని లక్ష్మీదేవికి ఇది అంకితం చేయబడింది.
అంతేకాకుండా శుక్రవారం గ్రహాల్లో ఒక్కడైనా శుక్ర దేవుడికి కూడా అంకితం చేయబడింది.జ్యోతిష్య శాస్త్రంలో( astrology ) శుక్రుడు వైవాహిక ఆనందం, వ్యక్తుల గౌరవం, ప్రేమ, అందానికి చెందిన దేవుడిగా ప్రజలు భావిస్తారు.
శుక్రవారం రోజున లక్ష్మీదేవి( Goddess Lakshmi ) సమేతంగా శుక్రుడిని పూజించడం వల్ల సంతోషం, శ్రేయస్సు, సంపదలు లభిస్తాయి.దీనితో పాటు వైవాహిక జీవితంలో ప్రత్యేక ఆనందం లభిస్తుంది.
అటువంటి పరిస్థితిలో శుక్రవారం సాయంత్రం ఈ చర్యలు చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందంతో పాటు సుఖ సంతోషాలు కలుగుతాయి.అలాగే శుక్రవారం రోజు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు ఇంటికి ఈశాన్య దిశలో ఖచ్చితంగా నెయ్యి దీపం వెలిగించాలి.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
శుక్రవారం ఆవుకి ఆహారం తినిపించాలి.అంతేకాకుండా శుక్రవారం మీరు ఆహారం తినే ముందు ఆవుకు నెయ్యి, బెల్లం ( Ghee , jaggery )కలిపిన తాజా రొట్టె తినిపించడం ఎంతో మంచిది.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో పాటు ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు.శుక్రవారం రాత్రి మొగలి ధూపం పరిమళం ఉన్న లేదా మొగలి పువ్వుల మాలను సమర్పించాలి.
ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లోకి ఐశ్వర్యాన్ని తెస్తుంది.ఇంకా చెప్పాలంటే శుక్రవారం సాయంత్రం పంచముఖి దీపంతో లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి.
ఇది ఇంట్లో సానుకూలతను తెలుస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే శుక్రవారం రోజున కర్పూరంలో కొద్దిగా కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి.
ఇలా చేయడం వల్ల జీవితంలో ఆర్థిక సమస్యలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు.
LATEST NEWS - TELUGU