మీ ఇంట్లో ఏ దిశలో ఏ వస్తువులు ఉంచాలో కచ్చితంగా వాస్తు శాస్త్రంలో ఉంది.వాస్తులో దిక్కులు చాలా ముఖ్యమైనవి.
ఇంట్లో ఏ వస్తువులు ఎ దిశలో పెట్టాలి ఏ మూలన బరువైన వస్తువులు ఉంచకూడదు.ఏ దిశలోబరువైన వస్తువులను తప్పకుండా ఉంచాలి అనే విషయాలను వాస్తు శాస్త్రం కచ్చితంగా చెబుతోంది.
మన జీవితంలో సమయం అనేది ఎంతో విలువైనది.అటువంటి సమయాన్ని కొలమానంలో పెట్టి మనకు చూపించే పరికరం గడియారం.
ఇది మనకు కాల పురుషుడి గమనాన్ని తెలియజేస్తూ ఉంటుంది.అటువంటి పరికరం వాస్తును అనుసరించి ఇంట్లో ఏ దిక్కున ఉంచితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.ఇంట్లో ఎప్పుడు కూడా చెడిపోయినా లేదా ఆగిపోయినా గడియారాన్ని ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.అలా ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉండడం అశుభమని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది.
చెడిపోయిన లేదా ఆగిపోయిన గడియారాలు ఇంట్లోకి నెగిటివీటిని వచ్చేలా చేస్తాయని చెబుతున్నారు.

అందువల్ల పగిలిపోయిన లేదా ఆగిపోయిన గడియారాలు ఇంట్లో అస్సలు ఉంచకూడదు.దక్షిణ దిశను యముని స్థానంగా పరిగణిస్తారు.అందుకే గడియారాన్ని ఎప్పుడూ అటువైపు పెట్టకూడదు.
అంతేకాదు ఇంటికి పడమర దిక్కున కూడా గడియారాన్ని అస్సలు ఉంచకూడదు.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం పై గడియారం ఉంచడం అసలు మంచిది కాదు.
గడియారం అక్కడ పెడితే ఇంట్లో ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి.

ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండదు.ఎప్పుడు తెలియని ఒక టెన్షన్ ఉంటుంది.అందుకే ప్రధాన ద్వారం పైన ఉన్న గోడ దగ్గర గడియారం అసలు ఉంచకూడదు.
ఎప్పుడు ఉత్తరా లేదా తూర్పు దిక్కులో ఉంచడం మంచిది.ఈ దిశలో గడియారం ఉంచడం వల్ల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి వారందరూ అన్యోన్యంగా ఉంటారు.బెడ్ రూమ్ లో కూడా గడియారం అస్సలు పెట్టకూడదు.
నిద్ర చెడిపోవడం మాత్రమే కాకుండా పిడకలలు రావడానికి కారణం అవుతుంది.