ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.54
సూర్యాస్తమయం: సాయంత్రం 05.43
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 12.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ఆర్థిక లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.
వృషభం:
ఈరోజు మీరు అనుకోకుండా ఇతరుల సహాయం అందుకుంటారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.
మిథునం:
కొన్ని దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది.అనుకోకుండా మీ స్నేహితులను కలవడం వల్ల వారితో కొన్ని విషయాలు పంచుకుంటారు.
కర్కాటకం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తారు.సంతానం కోసం పలు పూజ కార్యక్రమాలలో పాల్గొంటారు.
సింహం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని పనులు ప్రారంభించే ముందు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
కన్య:
ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
తులా:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల మంచి లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారి నుండి ఒక శుభవార్త వింటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
వృశ్చికం:
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఆలోచనలు చేస్తారు.
కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.కుటుంబ సభ్యుల కొన్ని ముఖ్యమైన సలహాలు తీసుకోవాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.
ధనస్సు:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుకుంటారు.
మకరం:
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్ము ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరుల సహాయం అందుకుంటారు.
కుంభం:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.వ్యాపారస్తులు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీనం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.
LATEST NEWS - TELUGU