అల్లు అర్జున్ స్థానంలో రామ్..ఆ దర్శకుడి సినిమాకు గ్రీన్ సిగ్నల్?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన రామ్ పోతినేని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈయన లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే ద్విభాషా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

 Ram Replace Allu Arjun And Given A Green Signal To That Director Film , Ram , Allu Arju , Tollywood , Director, Telugu Film Industry , Boyapati Seenu , Harish Shankar-TeluguStop.com

ఈ సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది.అదే విధంగా ప్రస్తుతం ఈయన బోయపాటి శీను దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈయనకు సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రామ్ బోయపాటి సినిమా తర్వాత డైరెక్టర్ హరి శంకర్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.నిజానికి హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయాల్సి ఉంది.

 Ram Replace Allu Arjun And Given A Green Signal To That Director Film , Ram , Allu Arju , Tollywood , Director, Telugu Film Industry , Boyapati Seenu , Harish Shankar-అల్లు అర్జున్ స్థానంలో రామ్..ఆ దర్శకుడి సినిమాకు గ్రీన్ సిగ్నల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలు రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా మరి కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

ఈ క్రమంలోనే హరీష్ శంకర్ మరో హీరోతో సినిమా చేయాలని భావిస్తున్నారు.అయితే గత కొద్దిరోజుల క్రితం హరీష్ శంకర్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలవడంతో తన తదుపరి చిత్రం హరిశంకర్ తో ఉంటుందని అందరూ భావించారు.అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన డీజే సినిమా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్లు అర్జున్ హరీష్ శంకర్ ని కలిసినట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా హరీష్ శంకర్ అల్లుఅర్జున్ తో చేయాలని భావించిన కథను రామ్ తో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.హరీష్ శంకర్ రామ్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube