మంగళగిరి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసిన నారా లోకేష్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని విధంగా పోలింగ్ శాతం నమోదయింది.గతంలో కంటే అత్యధికంగా ఓటర్లు( Voters ) ఈసారి తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.

 Nara Lokesh Thanked The People Of Mangalagiri Details, Tdp, Nara Lokesh, Mangala-TeluguStop.com

సాయంత్రం 6 గంటలకు కూడా భారీ ఎత్తున క్యూ లైన్ లో జనాలు నిలబడ్డారు.ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) మంగళగిరి నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.2019 ఎన్నికలలో కూడా మంగళగిరి( Mangalagiri ) నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.దీంతో ఓడిపోయిన చోట గెలవాలని.

మళ్లీ అక్కడి నుండే పోటీ చేయడం జరిగింది.ఈ క్రమంలో మంగళగిరి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అని సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.

“మంగళగిరి చైతన్యానికి మారుపేరని మరోమారు నిరూపితమైంధి.తెల్లవారకముందే నియోజకవర్గ ప్రజలు పోలింగ్ బూతుల వద్ద బారులుతీరి ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకోవడం శుభపరిణామం.సాయంత్రం 6గంటలకు కూడా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓపిగ్గా పోలింగ్ బూతుల్లో వేచి ఉండటం వెల్లివిరిసిన ప్రజాచైతన్యానికి ప్రతీక.పెద్దఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న నా మంగళగిరి కుటుంబసభ్యులకు, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను”.

అని ట్వీట్ చేశారు.కచ్చితంగా ఈసారి మంగళగిరి నియోజకవర్గం నుండి నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ( TDP ) క్యాడర్ భావిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube