మాతృ తర్పణాలకు ప్రత్యేకం...ఈ బిందు సరోవర్..!

మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయిన తర్వాత కూడా ప్రతి మనిషికి సంబంధించి ఎన్నో కార్యాలను నిర్వహిస్తారు.ఈ విధంగా నిర్వహించే కార్యక్రమాలలో చనిపోయిన తర్వాత చేసే తర్పణాలు కూడా ఒకటని చెప్పవచ్చు.

 Here Is The Only One Place Where Mother Shraddha Done , Pitru Paksha, Itru Tarpa-TeluguStop.com

చనిపోయిన మన కుటుంబ సభ్యులకు పెద్దవారికి ప్రతి ఏడాది తర్పణాలు పెట్టడానికి మహాలయ పక్షంలో వచ్చే పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు.ఈ పదిహేను రోజులలో ఏదో ఒక రోజు మనం మన ఇంట్లో మరణించిన వారికి తర్పణం పెట్టడం వల్ల వారి ఆత్మశాంతిస్తుందని పండితులు చెబుతున్నారు.

అయితే ముఖ్యంగా తల్లులకు తర్పణం పెట్టడానికి బిందు సరోవర్ ఎంతో ప్రాముఖ్యమైనదని చెబుతారు.అసలు ఈ బిందు సరోవర్ ప్రాముఖ్యత ఏమిటి? ఇక్కడ తల్లులకు తర్పణాలు ఎందుకు ప్రత్యేకం అనేది ఇక్కడ తెలుసుకుందాం.

గుజరాత్ లోని పఠాన్‌ జిల్లాలో ఉన్న సిద్ధుపూర్‌ కేవలం మాతృదేవతలకు శార్దం పెట్టే ఏకైక స్థలం. ఈ స్థల ప్రాముఖ్యతను ఋగ్వేదంలో కూడా వివరించబడింది.పురాణాల ప్రకారం కపిల అనే సాధువు ఉండేవాడు.అతని తల్లి పేరు దేవహుతి, తండ్రి కర్దం.

ఒకరోజు తన తండ్రి తపస్సు కోసం అడవికి వెళ్లాల్సి ఉండగా విచారంతో తన తల్లి దేవహుతి బిందు సరోవర్‌ ఒడ్డున ప్రాణాలు విడిచింది.ఆ సమయంలో కపిలుడు దివ్యదృష్టిని విష్ణువుపై కేంద్రీకరించగా తన తల్లి ఆత్మ దేవలోకానికి వెళ్లిందని గ్రహిస్తాడు.

ఆ తరువాత బిందు సరోవర్ ప్రాంతంలో మరణించిన తన తల్లి ఆత్మకు శాంతి కలగాలని అదే ప్రాంతంలోనే తనకు కర్మకాండ చేస్తాడు.అప్పటినుంచి బిందు సరోవరం ప్రాంతాన్ని మాత్రం మోక్ష స్థలంగా భావిస్తారు.

అందుకే ఈ ప్రాంతంలో మహాలయ పక్షంలో తమ తల్లులకు పిండప్రదానం చేసేవారు ఈ ప్రాంతానికి చేరుకుని పెద్ద ఎత్తున పిండ ప్రదాన కార్యక్రమాలను నిర్వహిస్తారు.ఈ విధంగా చనిపోయిన పెద్దవారికి పిండప్రదానాలు చేయటం వల్ల వారి ఆత్మ సంతోషించి వారు స్వర్గానికి వెళ్తారని.

ఇలా చేయడం వల్ల మన పై ఉన్నటువంటి పితృ దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube