Laser Light Project : ఈ వాహనం లేజర్ లైట్ చూశారా.. ఇది ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు ఉంటాయి.కొన్ని వీడియోలు తెలివైన ఆలోచనలను, టెక్నాలజీలను మనకు పరిచయం చేస్తాయి.

 Have You Seen The Laser Light Of This Vehicle You Will Be Surprised To Know Why-TeluguStop.com

తాజాగా ఆ కోవకు చెందిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ వాహనం ఇతర డ్రైవర్లకు వర్చువల్ అడ్డంకిని సృష్టించి, రోడ్డుపైకి లేజర్ లైట్ ప్రొజెక్ట్( Laser light project ) చేయడం మనం చూడవచ్చు.ప్రమాదాలు లేదా వెహికల్స్ క్రాష్ కాకుండా నివారించడానికి ఇది ఒక భద్రతా చర్య కావచ్చు, ప్రత్యేకించి వాహనం( Vehicle ) పెద్ద లేదా భారీ లోడ్‌ను మోస్తున్నప్పుడు, ఓవర్ టేక్ చేయడం చాలా ప్రమాదకరం.తప్పించుకోవడానికి చాలా తక్కువ సమయం మిగులుతుంది.

స్పేస్ కూడా ఉండదు.అలాంటి పరిస్థితులలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోక తప్పదు.

ముందు వెళ్లే లేదా ఎదురుగా వచ్చే వెహికల్ ఉనికి స్థానం గురించి డ్రైవర్లను హెచ్చరించడానికి, ముఖ్యంగా తక్కువ దృశ్యమాన పరిస్థితులలో లేజర్( Laser ) హెచ్చరిక చిహ్నంగా కూడా ఉపయోగపడుతుంది.ఇది ఒక తెలివైన ఆలోచన, ఇది ప్రాణాలను కాపాడుతుంది, ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది.హౌ థింగ్స్ వర్క్స్ ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.షేర్ చేసిన సమయం నుంచి ఈ వీడియోకు 74 లక్షల వ్యూస్, పదివేల దాకా లైక్స్ వచ్చాయి.

ఇలాంటి లేజర్ లైట్ తమకు కూడా కావాలని కొందరు వాహనదారులు కామెంట్ సెక్షన్‌లో తెలిపారు.దీనిని మీరు కూడా చూసేయండి.భారతదేశంలో కూడా రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి.ముఖ్యంగా రాత్రి సమయాల్లో.

ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి భారత ప్రభుత్వం చాలానే ప్రయత్నాలు చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube