ఉడకబెట్టిన కోడిగుడ్డును తింటే మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.కోడిగుడ్డును ఫ్రై లేదా కూరగా చేసుకొని తినటం కన్నా ఉడకబెట్టిన కోడిగుడ్డును తినటం మంచిది.
మన శరీరానికి ఎక్కువ పోషకాలు అందాలంటే ఉడకబెట్టిన కోడిగుడ్డును తినాలి.అయితే ఉడికించిన కోడిగుడ్డును చాలా మంది ఉదయం ఉడికించి సాయంత్రం తింటూ ఉంటారు.
ఆలా చేయటం చాలా తప్పు.ఉడికించిన కోడిగుడ్డును ఉడికించిన వెంటనే తినాలి.
అయితే ఉడికించిన ఎంత సేపటిలో తినాలో తెలుసుకుందాం.
ఉడకబెట్టిన గుడ్లను ఫ్రిజ్లో పెట్టకపోతే ఒక పూట వరకు అలాగే ఉంచి తినవచ్చు.
ఎటువంటి ఇబ్బంది ఉండదు.ఒక పూట సమయం దాటితే తినకూడదు.
ఎందుకంటే ఉడికిన గుడ్డుపై బాక్టీరియా, వైరస్లు త్వరగా చేరి అవి కంటామినేట్ అవుతాయి.కనుక ఉడికిన గుడ్డును ఒక పూటలోపే తినాల్సి ఉంటుంది.
ఇక ఉడికించిన గుడ్డును పొట్టుతో అలాగే ఫ్రిజ్లో పెడితే వారం రోజుల వరకు వాటిని నిల్వ ఉంచవచ్చు.అయితే పొట్టు తీసిన ఉడికించిన గుడ్డును 3-4 రోజుల వరకు ఫ్రిజ్లో నిల్వ ఉంచవచ్చు.
అయితే ఉడికించిన గుడ్డును ఫ్రిజ్లో పెట్టినప్పుడు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి.ఉడికించిన కోడిగుడ్డును గాలి చొరబడని టైట్ కంటెయినర్లో పెట్టి ఫ్రిజ్లో పెడితే పాడవకుండా ఉంటాయి.
ఏది ఏమైనా ఉడికించిన కోడిగుడ్డును ఉడికించిన తర్వాత ఎంత తొందరగా తింటే అంత మంచిది.అలాగే మన శరీరానికి పోషకాలు బాగా అందుతాయి.