చర్మంపై ఎటువంటి మచ్చలు( Acne ) లేకుండా ముఖం బ్యూటిఫుల్ గా మరియు గ్లోయింగ్ గా మెరిసిపోతూ కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.అటువంటి చర్మాన్ని పొందడానికి రకరకాల ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు.
నెలకు రెండు సార్లు బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్, టాన్ రిమూవల్ వంటివి చేయించుకుంటారు.కానీ వాటికంటే పవర్ ఫుల్ గా పని చేసే మ్యాజికల్ హోమ్ రెమెడీ ఒకటి ఉంది.
ఈ రెమెడీ మొండి మచ్చలను పోగొడుతుంది.ముఖ చర్మాన్ని బ్యూటిఫుల్ గా మరియు గ్లోయింగ్ గా మెరిపిస్తుంది.
మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు బంగాళదుంప స్లైసెస్,( Potato Slices ) రెండు టమాటో స్లైసెస్,( Tomato Slices ) రెండు కీర దోసకాయ స్లైసెస్, రెండు లెమన్ స్లైసెస్ వేసుకుని నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి,( Multani Mitti ) వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి మరియు వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని ఫాలో అయితే బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.ఈ సింపుల్ రెమెడీ చర్మం పై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది.
టాన్ ను రిమూవ్ చేస్తుంది.
అలాగే చర్మంపై ఏర్పడిన మొండి మచ్చలను క్రమంగా మాయం చేస్తుంది.చర్మ ఛాయను మెరుగు పరుస్తుంది.ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
అంతేకాకుండా ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ టైట్ అవుతుంది. ఏజింగ్( Aging ) సైతం ఆలస్యం అవుతుంది.
కాబట్టి సహజంగానే అందంగా మెరిసిపోవాలని కోరుకునే వారు ఈ హోమ్ రెమెడీని అస్సలు మిస్ అవ్వండి.