ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఓటమికి కారణాలేంటనే ప్రశ్నకు చాలామంది రోజా( Roja ) పేరును సమాధానంగా చెబుతారు.వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరును సొంతం చేసుకున్న రోజా చాలా సందర్భాల్లో అడ్డూఅదుపు లేకుండా చేసిన విమర్శలు పార్టీకి మైనస్ అయ్యాయని చాలామంది ఫీలవుతారు.
అయితే ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందే రోజా గురించి షకలక శంకర్( Shakalaka Shankar ) చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రోజా గారు చేసిన తప్పులను వదలరని తప్పు తప్పే అని షకలక శంకర్ వెల్లడించారు.
తప్పు ఒకరోజు కాకపోయినా మరో రోజు అయినా బయటకు వస్తుందని ఆయన తెలిపారు.రోజాగారు మనుషులను మరిచిపోయి మాట్లాడటం కరెక్ట్ కాదని షకలక శంకర్ వెల్లడించారు.గెలిస్తే విర్రవీగి మాట్లాడకూడదని ఆయన పేర్కొన్నారు.నా నోటి నుంచి చెప్పలేని మాటలను ఆమె అన్నారని షకలక శంకర్ చెప్పుకొచ్చారు.
రోజా అనే కాదు అలా చాలామంది ఉన్నారని ఒక చరిత్ర ముగిసిపోయిందని షకలక శంకర్ తెలిపారు.పవన్( Pawan Kalyan ) ట్రెండ్ సెట్టర్ అని మేము అనుకుంటామని పవన్ సినిమాల్లో డైలాగ్స్ రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనల డైలాగ్స్ అని షకలక శంకర్ చెప్పుకొచ్చారు.కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమో కానీ రావడం పక్కా అని పవన్ చెప్పిందే నిజమని షకలక శంకర్ పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టర్ అని ఆయన తెలిపారు.
పవన్ ఎప్పుడూ సమాజ శ్రేయస్సు కోరుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు.ఎంతోమంది మహానుభావులు రాసిన పుస్తకాలను పవన్ చదివారని షకలక శంకర్ వెల్లడించారు.పవన్ కళ్యాణ్ మహా జ్ఞాని అని ఆయన జ్ఞానం ఏపీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.షకలక శంకర్ చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
షకలక శంకర్ చెప్పిన విషయాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.