సాధారణంగా అమ్మాయిల్లో ఎక్కువ శాతం మంది స్మూత్ అండ్ షైనీ హెయిర్ ను ఇష్టపడుతూ ఉంటారు.అయితే అందరికీ అటువంటి హెయిర్ ఉండకపోవచ్చు.
ఈ క్రమంలోనే సెలూన్ లో వేలకు వేలు ఖర్చు పెట్టి కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చాలా సులభంగా స్మూత్ అండ్ షైనీ హెయిర్ ను పొందవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హెయిర్ మాస్క్ ( Hair mask )చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ లెమన్ జ్యూస్, ( Lemon juice )వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకుని స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి.చివరగా ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసి అన్నిటినీ మరోసారి కలుపుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.
మాస్క్ అప్లై చేసుకున్న ముప్పై లేదా నలభై నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ ( Hair wash )చేసుకోవాలి.గుడ్డులో ఉండే ప్రోటీన్లు మరియు కొవ్వు ఆమ్లాలు జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.మూలల నుంచి జుట్టును బలోపేతం చేస్తాయి.హెయిర్ ఫాల్, హెయిర్ బ్రేకేజ్ ను అరికడుతాయి.అదే సమయంలో జుట్టుకు మంచి తేమను అందించి స్మూత్ గా మరియు షైనీగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.అలాగే అలోవెరా జెల్, ఆముదం, లెమన్ జ్యూస్ కూడా జుట్టును స్మూత్ గా మార్చడానికి షైనీ గా మెరిపించడానికి సహాయపడతాయి.
అలాగే బలహీనమైన కురులను ఇవి బలోపేతం చేస్తాయి.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా సైతం ప్రోత్సహిస్తాయి.