ఫూల్ మఖానా( Fool Makhana ) గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.వీటినే ఫాక్స్ నట్స్, తామర గింజలు అని కూడా అంటాము.
సాధారణంగా వివిధ రకాల భారతీయ స్వీట్లు, ఖీర్, రైతా వంటి వంటకాల్లో మఖానాను విరివిగా ఉపయోగిస్తారు.అలాగే మఖానాతో కర్రీ, రుచికరమైన స్నాక్స్ కూడా తయారు చేస్తుంటారు.
ఆరోగ్యపరంగా మఖానా చాలా మేలు చేస్తాయి.హార్మోన్ బ్యాలెన్స్ నుంచి ఎముకలను బలోపేతం చేయడం వరకు అనేక ప్రయోజనాలు అందిస్తాయి.
అయితే ఆరోగ్యానికి మంచిదని చెప్పి మఖానాను అతిగా తింటే లాభాలు కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.ఫూల్ మఖానాను లిమిట్ లెస్ గా తినడం వల్ల ఉబ్బరం, గ్యాస్, అతిసారం లేదా మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడవచ్చు.
సరిగ్గా నమలకుండా తిన్నా కూడా ఆయా జీర్ణ సమస్యలు( Digestive problems ) తలెత్తుతాయి.
అలాగే మధుమేహం ఉన్న వారికి మఖానా మంచి ఆహార ఎంపిక.కానీ పెద్ద మొత్తంలో మఖానా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు( Sugar levels ) పెరుగుతాయి.ప్యాక్ చేయబడిన లేదా రుచిగల మఖానా స్నాక్స్ ఉత్పత్తులలో అదనపు ఉప్పు ఉంటుంది.
అటువంటి మఖానాను తింటే అధిక రక్తపోటు( High blood pressure ) ప్రమాదం పెరుగుతుంది.అందువల్ల తక్కువ ఉప్పు జోడించి ఇంట్లోనే మఖానాతో స్నాక్స్ తయారు చేసుకోవడం ఉత్తమం.
కొందరు వ్యక్తులు మఖానాకు అలెర్జీ కలిగి ఉండవచ్చు.ఇటువంటి వారు మఖానాకు దూరంగా ఉండాలి.లేదంటే దురద, వాపు, చర్మం ఎరుపెక్కడం వంటి లక్షణాలను అనుభవిస్తారు.అంతేకాకుండా మఖానాలో ఆక్సలేట్‌లు ఉంటాయి.అధిక మొత్తంలో మఖానాను తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.ఫైనల్ గా చెప్పేది ఏంటంటే.
ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ మఖానాను లిమిట్ గా మాత్రమే తీసుకోవాలి.గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మరియు మధుమేహం ఉన్నవారు మఖానా తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.