బంగాళాదుంప పేరు చెబితే చాలు ఎవరికయినా సరే నోట్లో నీళ్లు ఊరతాయి.దుంపల్లో బంగాళాదుంపకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.
పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా బంగాళదుంపను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.బంగాళదుంపతో చాలా రకాల వెరైటీ వంటలు చేయవచ్చు.
అలాగే ఆలులో పిండిపదార్ధాలు, కార్బోహైడ్రేట్లు, పీచు, కొవ్వు పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి.అంతేకాకుండా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఇనుము, విటమిన్ బి6, సి, రైబోఫ్లావిన్, ధయామిన్ వంటివి పోషకాలు పుష్కలంగా లభ్యమౌతాయి.
బంగాళాదుంప తినడం వలన ఆరోగ్యానికి మాత్రమే ఉపయోగకరం కాదు.బంగాళ దుంప ఆడవాళ్ళ అందాన్ని రెట్టింపు చేయడంలో కూడా ఉపయోగపడుతుంది.
చర్మ సౌందర్యాన్ని పెంచడంలో బంగాళదుంప ఎంతగానో ఉపయోగపడుతుంది.చాలా మంది కళ్ల క్రింద నల్లని వలయాలతో ఇబ్బంది పడుతు ఉంటారు.అలాంటి వారికి బంగాళ దుంప రసం బాగా సహాయపడుతుంది.బంగాళ దుంప నుంచి రసాన్ని తీసి ఆ రసాన్ని నలుపు భాగం ఉన్నచోట రాయటం వల్ల నల్లని వలయాలు తగ్గిపోతాయి.
అంతేకాకుండా ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలను పోగొట్టడంలో బంగాళాదుంప బాగా ఉపయోగపడుతుంది.

చర్మంపై ముడతలు పోగొట్టి చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలాగా చేయడంలో బంగాళాదుంప కీలక పాత్ర పోషిస్తుంది.చర్మంపై ఏర్పడిన మృతకణాలను తొలగించి చర్మాన్ని మరింత మెరిసేలాగా చేస్తుంది.నిజానికి బంగాళాదుంపల కన్నా దానిపైన ఉండే పొట్టులోనే ఎన్నో రకాలు అయిన పోషకాలు ఉంటాయి.
ఈ పొట్టులో విటమిన్ ఎ శాతమే అధికంగా ఉంటుంది.అలాగే బంగాళాదుంప తొక్కలో విటమిన్ సి, బి కూడా ఎక్కువగా ఉంటాయి.
అయితే బంగాళాదుంపల తొక్కల్లో సొలనైన్ అనబడే విషపదార్థం ఉంటుంది కాబట్టి తక్కువ మొతాదులో తింటే మంచిది.