ఇటీవల కాలంలో సీక్వెల్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది అన్ని భాషలలో కూడా సీక్వెల్ సినిమాల ద్వారా హీరోలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.అయితే ఎన్టీఆర్( NTR ) సైతం ప్రస్తుతం సీక్వెల్ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈయన దేవర 2( Devara 2 ) తో పాటు వార్ 2 సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు.ఇక ఎన్టీఆర్ సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయని చెప్పాలి అలాంటి వాటిలో జనతా గ్యారేజ్( Janatha Garage ) సినిమా కూడా ఒకటే.
కొరటాల శివ ( Koratala Shiva ) దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా ద్వారా మోహన్ లాల్ ( Mohan Lal ) సైతం తెలుగులో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.ఇక ఈ సినిమా అనంతరం మోహన్లాల్ నటించిన సినిమాలు కూడా తెలుగులో విడుదలవుతున్నాయి.తాజాగా మోహన్ లాల్ లూసిఫర్ సీక్వెల్( Lucifer Sequel ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన హైదరాబాద్లో కూడా సందడి చేశారు అయితే ఓ కార్యక్రమంలో భాగంగా ఈయనకు జనతా గ్యారేజ్ సినిమా సీక్వెల్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ సందర్భంగా మోహన్లాల్ మాట్లాడుతూ జనతా గ్యారేజ్ సీక్వెల్ సినిమా కనుక చేస్తే నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు.స్వయంగా మోహన్ లాల్ వంటి వ్యక్తి ఈ సినిమా గురించి ఈ విధమైనటువంటి కామెంట్లు చేయడంతో కచ్చితంగా జనతా గ్యారేజ్ సీక్వెల్ సినిమా కావాలి అంటూ ఫ్యాన్స్ కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు.అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా సీక్వెల్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర 2 గురించి వార్తలు వస్తున్నాయి అయితే ఈ సినిమా సీక్వెల్ గురించి అధికారక ప్రకటన మాత్రం వెల్లడించలేదు అయితే ఎన్టీఆర్ ఈ రెండు సీక్వెల్ సినిమాలకు కొరటాల శివ దర్శకుడు కావడం విశేషం.