ప్రస్తుత రోజుల్లో తక్కువ వయసులోనే వైట్ హెయిర్ తో సతమతం అవుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.వైట్ హెయిర్ కవర్ చేసుకునేందుకు ఎక్కువ శాతం మంది కృత్రిమ రంగుల పై ఆధారపడుతుంటారు.
కానీ కృత్రిమ రంగుల్లో ఎన్నో రసాయనాలు నిండి ఉంటాయి.అవి మన జుట్టు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
అయితే ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ ఆయిల్ ను వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.సహజంగానే వైట్ హెయిర్ ని బ్లాక్ గా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు లేటు ఆ హెర్బల్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె వేసుకోవాలి.
నూనె లైట్ గా హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ శీకాకై పౌడర్, వన్ టేబుల్ స్పూన్ రీతా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ హెన్నా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ తులసి పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసి చిన్న మంటపై కనీసం పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం పల్చటి వస్త్రం సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.
నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఈ హెర్బల్ ఆయిల్ ను వాడితే తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది.అలాగే ఈ హెర్బల్ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.
కాబట్టి ఎవరైతే వైట్ హెయిర్ తో వర్రీ అవుతున్నారో వారు తప్పకుండా ఈ హెర్బల్ ఆయిల్ ను వాడేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.