వారంలో విడుదలైన మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్( Mohan Lal ) సినిమా తుడరుం.కాగా మోహన్ లాల్ హీరోగా వచ్చిన దృశ్యం( Drushyam ) దాని సీక్వెల్ ఎంత సంచలనం సృష్టించిందో వేరే చెప్పనక్కర్లేదు.
దానికి మూడో పార్టును కూడా ఇప్పటికే అనౌన్స్ చేశారు.తుడరుం( Thuduram ) చూస్తే దృశ్యం సినిమా చాలా సార్లు గుర్తుకు వస్తుంది.
అయితే ఇది చాలా ప్రత్యేకం ఇదే సమయంలో దృశ్యం తరహాలో ఈ సినిమాలోనూ మోహన్ లాల్ ఒక బాధిత కుటుంబ పెద్దగా నిలుస్తాడు.అయితే ఇందులో హీరోయిజం పోకడలు ఉంటాయి.
దృశ్యం ఒక రియల్ టైమ్ క్రైమ్ స్టోరీలాంటిది అయితే, తుడరం పగా, ప్రతీకారంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్.దృశ్యంలో మోహన్ లాల్, మీనా చేసిన దంపతుల పాత్రలకు ఇద్దరు కూతుళ్ల పాత్రలు ఉంటే, ఇందులో మోహన్ లాల్ శోభన దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు పాత్రలు ఉంటాయి.
అసలు కథ ఏమిటి అన్న విషయానికి వస్తే.షణ్ముగం అలియాస్ బెన్స్(మోహన్ లాల్) ఒక ట్యాక్సీ డ్రైవర్.కనీసం ట్యాక్సీ పర్మిట్ కూడా ఉండదు.తనకంటూ మిగిలిన ఒక పాత అంబాసిడర్ కారును ఊళ్లో పిల్లలను స్కూళ్లకు దింపేందుకు, ఎవరైనా టూర్ కు పిలిస్తే వారికి రెంట్ కు వెళ్తూ వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు.
దిగువ మధ్యతరగతి కుటుంబమే అయినా జీవితంలో ఎదురు దెబ్బలున్నా ఆనందంగా గడిపే కుటుంబం.అయితే షణ్ముగం పూర్వాశ్రమంలో ఒక ఫైట్ మాస్టర్ కు అసిస్టెంట్.
చెన్నైలో ఒక ప్రముఖ ఫైట్ మాస్టర్ (భారతి రాజా)( Bharati Raja ) వద్ద పని చేసి ఉంటాడు.అక్కడ ఒక ఫైట్ చిత్రీకరణలో ఇతడిని కాపాడబోయి ఒక సహచరుడు మరణించి ఉంటాడు.
ఆ పాత్రను ఫోటోలో మాత్రమే చూపుతారు, ఆ పాత్రకు విజయ్ సేతుపతి ఫొటో వాడారు.

కథ ఆగమనంలో తెలిసేది ఏమిటంటే ఆ మరణించిన మరో ఫైటర్ భార్య శోభన.అతడి మరణం తర్వాత అండ లేకుండా పోయిన కుటుంబానికి షణ్ముగం తోడవుతాడు.వారు భార్యా భర్తలై ఉంటారు.
ఇలా సాగిపోయే బెన్స్ కు తన ఒకప్పటి గురువైన ఫైట్ మాస్టర్ చనిపోయాడనే వార్త తెలిసి చెన్నై వెళ్తాడు.ఆ వెళ్లడానికి ముందు తన కారు చిన్న రిపేర్ రావడంతో రెగ్యులర్ గ్యారేజ్ లోనే ఇచ్చి వెళ్లి ఉంటాడు.
అతడు తిరిగి వచ్చే సరికి కారు పోలిస్ స్టేషన్ లో ఉంటుంది! ఈ విషయం తెలిసి రావడంతోనే స్టేషన్ కు వెళ్తాడు.ఆ గ్యారేజ్ లో పనిచేసే ఒక కుర్రాడు గంజాయి స్మగ్లింగ్ చేయడానికి వెళ్లి గ్యారేజ్ లో రిపేర్ కు వచ్చిన కారును తీసుకెళ్లి ఉంటాడు.
అతడిని పోలీసులు వెంబడించగ కారును వదిలి పారిపోయి ఉంటాడు.పోలీసులు కారును స్టేషన్ లో పెడతారు.
పారిపోయిన వాడు ఒక ఎస్ఐని కొట్టి మరీ పారిపోయి ఉంటాడు.దీంతో పోలీసులు కసిగా ఉంటారు.
వారిని బతిమాలి, బుజ్జగించుకుని ఆ కారును విడిపించుకోవడానికి షణ్ముగం ప్రయత్నాలు మొదలవుతాయి.ఎస్ఐ అడిగినంత డబ్బును ఇతడు ఇవ్వలేడు.
అయితే ఆ రాత్రికి డీవై ఎస్పీ స్టేషన్ కు వస్తాడని తెలిసి రాత్రిపూట స్టేషన్ కు వెళ్తాడు.వెళ్లగానే అతడు కూల్ గా మాట్లాడి కారు కీస్ ఇచ్చేయమని ఎస్ఐకి చెబుతాడు.

ఎస్ ఐ కూడా చేసేది లేక కారు కీస్ ఇస్తాడు.అయితే అదే సమయంలో స్టేషన్ లో పని చేసే ఒక కానిస్టేబుల్ చెల్లెలి పెళ్లి ఉందని, తమకు మరే వాహనం లేదని తమను అక్కడ వదలమని డీవై ఎస్పీ కోరడంతో బెన్స్ కాదనలేకపోతాడు.తనకు కారును ఇప్పిస్తున్నాడు కదా అనే మొహమాటంతో ఒప్పుకుంటాడు.ఆ పెళ్లికి వెళ్తేఅక్కడ ఈ పోలీసులు తాగితందనాలు ఆడతారు.మరింతగా తాగడానికి అడవిలోకి తీసుకెళ్లమని బెన్స్ పై ఒత్తిడి చేస్తారు.అక్కడ కూడా కాదనలేక కారును తీయడంతో అసలు కథ మొదలవుతుంది! కొంత దూరం వెళ్లాకా కారు డిక్కీలో శవం ఉందని, పెళ్లి వేడుక సమయంలో దాన్ని డిక్కీలో చేర్చినట్టుగా అడవిలో దాన్ని పాతి పెట్టాలని, ఈ విషయం బయటకు చెప్పొందంటూ వారు ట్విస్ట్ ఇవ్వడంతో బెన్స్ నిర్ఘాంతపోతాడు! పోలీసుల చెప్పినట్టుగా చేయడం మినహా అతడికి మరో మార్గం ఉండదు.
అయితే అప్పటి వరకూ మెత్తగా కనిపించే డీవై ఎస్పీ క్రౌర్యంలో తొలి మెట్టు అక్కడ బయటపడుతుంది.కాని స్టేబుల్ చెల్లెలిని ఒక కుర్రాడు బ్లాక్ బెయిల్ చేశాడని, వీడియోలు ఉన్నాయని, దీంతో కానిస్టేబుల్ తండ్రి అతడిని చంపినట్టుగా బెన్స్ కు ఆ పోలీసు చెబుతాడు.
ఆ తర్వాత చాలా ట్విస్టులతో సినిమా సాగుతుంది.ఆ శవం ఎవరిది, దాంతో బెన్స్ కు సంబంధం ఏమిటి? ఆ మర్డర్ ఆ తర్వాత ఎలాంటి మలుపులు తిరుగుతుంది, బెన్స్ ఎలా ఇక్కట్ల పాలవుతాడు, వాటిని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ!
.