వర్షాకాలం వస్తే అనేక రోగాలు వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.వాటిని రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒకవేళ ఏదైనా వ్యాధి బారిన పడిన వాటి నుంచి ఉపశమనం పొందడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి.ముఖ్యంగా వాన కాలంలో అనేక రకాల ఇన్ఫెక్షన్లు రావడానికి అవకాశం ఉంది.
కాబట్టి మన రోజువారీ ఆహారంలో కొన్ని కూరగాయలు, గింజలు, పండ్లు, ఆకుకూరలు లాంటివి ఉండేలా చూసుకోవాలి.
వీటి వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా అభివృద్ధి చెందుతుంది.
అంతే కాదు కొన్ని ప్రత్యేకమైన వాటిని తీసుకోవడం ద్వారా శరీరం అధిక బరువు ఉన్నా కాని పూర్తిగా తగ్గించే విధంగా ఉపయోగపడతాయి.బరువు తగ్గడానికి ఏవేవో చేయాల్సిన అవసరం ముమ్మాటికీ లేదు.
అందుకు పెద్దగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు.ఇందుకోసం మనకు ప్రకృతి సహజ సిద్ధంగానే కొన్నిటిని మనకు అందించింది.
వాటిని సరి పాళ్లలో ఉపయోగించుకుంటే శరీర బరువును చాలా సులువుగా తగ్గించుకోవచ్చు.ఇక ఇందుకోసం మన ఇంట్లో బాగా లభించే నిమ్మకాయ, అల్లం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు.
ఈ రెండింటి ద్వారా తయారు చేసుకునే డ్రింక్ ద్వారా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును చాలా వరకు తగ్గించవచ్చు.అదికూడా కేవలం వారం రోజుల్లోనే మీకు తేడా గమనించే విధంగా.
ఇందుకోసం ఎటువంటి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు.ప్రత్యేకమైన వర్కౌట్స్ కూడా చేయాల్సిన అవసరమే లేదు.
మరి ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలో, ఎన్ని సార్లు వాడాలో ఒకసారి చూద్దామా.

ముందుగా ఓ నిమ్మకాయ రసాన్ని ఓ గిన్నెలోకి తీసుకొని, అందులోకి తాజా అల్లం ముక్క కు ఉన్న తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి నిమ్మరసం వేసుకోవాలి.ఆ తర్వాత అందులోకి కొన్ని నీరు పోసి.వాటిని స్టవ్ మీద ఉంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి.
బాగా ఉడికిన తర్వాత దానిని పక్కకు తీసి వడకట్టుకోవాలి.ఇలా తయారైన డ్రింక్ ను, ప్రతిరోజు టీ లాగే కొద్దిగా వేడి చేసుకొని తాగవచ్చు.
అలా కుదరకపోతే ఫ్రిజ్ లో ఉంచుకొని కూల్ గా కూడా తాగవచ్చు.ఈ పేస్ట్ ను తాగడానికి నచ్చకపోతే, అందులో మీరు కాస్త తేనెను కలుపుకొని కూడా తాగవచ్చు.
ఇలా రోజుకు రెండు లేదా మూడు కప్పులు మూడు పూట్ల తీసుకుంటే కేవలం వారం రోజులలో మీకు మీరు ఏ విధంగా బరువు తగ్గుతున్నారో ఇప్పుడే కనబడుతోంది.